Homeజాతీయంమణిపుర్‌లో ఆరని హింసాకాండ

మణిపుర్‌లో ఆరని హింసాకాండ

- Advertisement -

ప్రతీకార దాడిలో ఇద్దరు కుకీల కాల్చివేత

ఇంఫాల్‌: మణిపుర్‌లో గిరిజన తెగల మధ్య హింస ఆరని కుంపటిలా రగులుతోంది. తాజాగా కాంజొంగ్‌ జిల్లా కుల్తుకుకి గ్రామంపై గురువారం తెల్లవారుజామున దాడికి పాల్పడిన సాయుధ దుండగులు కుకీ తెగకు చెందిన ఇద్దరు వ్యక్తుల్ని కాల్చి చంపారు. పలు ఇళ్లు తగలబెట్టారు. సాయుధ ముఠా ఒకటి గతనెల 13న కోనాసఖుల్‌ నాగా గ్రామం నుంచి 40 మందికిపైగా పౌరులు అపహరించుకుపోయిన విషయం తెలిసిందే. అయితే చర్చల తర్వాత చాలా మందిని విడిచిపెట్టినప్పటికీ.. ఆరుగురు నాగా వర్గానికి చెందిన వ్యక్తులు అదృశ్యమయ్యారు. ఈక్రమంలో నిర్వహించిన సెర్చ్‌ ఆపరేషన్‌లో వారి మృతదేహాలు లభ్యమైనట్లు పోలీసులు బుధవారం ‘ఎక్స్‌’ వేదికగా తెలిపారు. ఈ క్రమంలో మృతదేహాలు లభ్యమై 24 గంటలు కూడా గడవక ముందే ఈ దాడి జరిగింది. దీంతో ఇది ప్రతీకార దాడేనని స్పష్టమవుతోంది. ఈ ఉదంతంపై విచారణ కొనసాగిస్తున్నామని పోలీసులు వెల్లడించారు. మరోవైపు ఆరుగురు నాగా జాతీయుల మృతిపై మణిపుర్‌ ముఖ్యమంత్రి యుమ్‌నమ్‌ ఖేమ్‌చంద్‌ సింగ్‌ సంతాపం వ్యక్తం చేశారు. నేరానికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు కట్టుబడి ఉన్నామని ఆయన అన్నారు. ఈ దారుణ ఘటనపై ఎన్‌ఐఏ విచారణ జరుపుతోందని తెలిపారు. కాగా, ఫిబ్రవరిలో కుకి, నాగా తెగల మధ్య ఉద్రిక్తతలు రాజుకున్న నాటి నుంచీ ఇప్పటి వరకూ 25 మంది ప్రాణాలు కోల్పోయారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు