Sunday, January 19, 2025
Homeఆంధ్రప్రదేశ్సంక్రాంతి పండుగ వేళ ఏపీ ప్రభుత్వం శుభవార్త..పెండింగ్ బిల్లులు జమ చేస్తున్న ప్రభుత్వం

సంక్రాంతి పండుగ వేళ ఏపీ ప్రభుత్వం శుభవార్త..పెండింగ్ బిల్లులు జమ చేస్తున్న ప్రభుత్వం

సంక్రాంతి పండుగ వేళ ఏపీ ప్రభుత్వం శుభవార్త.పెండింగ్ బిల్లులు జమ చేస్తున్న ప్రభుత్వం
సంక్రాంతి పండుగ వేళ వివిధ వర్గాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న బకాయిలను విడుదల చేసేందుకు ఇటీవల ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఆర్థిక శాఖపై సమీక్షా సమావేశం నిర్వహించిన సీఎం చంద్రబాబు.. విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, పోలీసులు ఇలా అన్ని వర్గాలకు ఊరట కలిగించేలా పెండింగ్ బకాయిలు, బిల్లులు విడుదల చేయాలని ఆదేశించారు. సుమారు రూ.6,700 కోట్లు విడుదల చేయాలని ఆదేశించారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు పెండింగ్ బకాయిలు, నిధులు విడుదల జరుగుతోంది. నిన్న ఆదివారం సెలవు రోజైనప్పటికీ.. నిధుల విడుదలకు ఆర్థిక శాఖ చర్యలు తీసుకుంటోంది. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని సోమవారం సాయంత్రంలోగా బకాయిల నిధులను అకౌంట్లలోకి జమ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న బకాయిలు విడుదల చేస్తూ ఉండటంతో విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఏపీ ఎన్జీవో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్ ప్రకటన రిలీజ్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, ఇతర అధికారులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఉద్యోగులకు సుమారు రూ.1300 కోట్ల వరకూ బకాయిల నిధులు విడుదల కానున్నాయని అధికారులు చెప్తున్నారు. సోమవారం సాయంత్రానికి మొత్తం బిల్లులు జమచేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

మరోవైపు ఇటీవల ఆర్థిక శాఖపై నిర్వహించిన సమీక్షలో ఉద్యోగుల జీపీఎఫ్ పెండింగ్ బకాయిలు రూ.519 కోట్లు, పోలీసుల సరెండర్ లీవ్ బకాయిలు రూ.214 కోట్లు, సీపీఎస్ బకాయిలు రూ.300 కోట్లు, టీడీఎస్ పెండింగ్ బకాయిలు రూ.265 కోట్లు విడుదల చేయాలని నిర్ణయించారు. అలాగే ఆరున్నర లక్షల మంది విద్యార్థులకు ఉపయోగపడేలా విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ.788 కోట్లు విడుదల చేస్తున్నారు. అలాగే 26 వేల మంది కాంట్రాక్టర్లకు ఉపయోగపడేలా రూ.10 లక్షలలోపు బకాయిలు చెల్లించాలని చంద్రబాబు ఆదేశించారు. ఈ నిర్ణయం ప్రకారం చిన్న కాంట్రాక్టర్లకు రూ.586 కోట్లు విడుదల చేస్తున్నారు. అలాగే విద్యుత్ శాఖకు రూ.500 కోట్లు, ఎన్టీఆర్ వైద్యసేవకు రూ.500 కోట్లు, అమరావతి కౌలు రైతులకు రూ.241 కోట్లు, చిరు వ్యాపారులకు రూ.100 కోట్లు చొప్పున పెండింగ్ బకాయిలు విడుదల చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు