Homeజిల్లాలుఅనంతపురంపోలీసు సిబ్బందికి క్యాన్సర్ వ్యాధిపై అవగాహన సదస్సు

పోలీసు సిబ్బందికి క్యాన్సర్ వ్యాధిపై అవగాహన సదస్సు

- Advertisement -

విశాలాంధ్ర -అనంతపురం టౌన్ : జిల్లా ఎస్పీ పి.జగదీష్ ఆదేశాల మేరకు ఏ.ఆర్ అదనపు ఎస్పీ ఇలియాస్ బాషా పర్యవేక్షణలో ఏ.ఆర్ డీఎస్పీ నీలకంఠేశ్వరరెడ్డి శుక్రవారం స్థానిక పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో పోలీసు సిబ్బందికి స్థానిక కిమ్స్ సవీరా ఆసుపత్రి వారి సౌజన్యంతో క్యాన్సర్ వ్యాధిపై అవగాహన సదస్సు నిర్వహించారు. ​ఈ సందర్భంగా కిమ్స్ సవీరా ప్రముఖ అంకాలజిస్ట్ వెంకట సింహ మాట్లాడుతూ.. నిరంతరం ప్రజల రక్షణలో బిజీగా ఉంటూ తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసే పోలీసు సిబ్బందికి ఇటువంటి అవగాహన కార్యక్రమాలు ఎంతో అవసరమని పేర్కొన్నారు. క్యాన్సర్ మహమ్మారి పట్ల ప్రాథమిక దశలోనే అప్రమత్తంగా ఉంటే, సరైన చికిత్స ద్వారా దానిని పూర్తిగా నయం చేయవచ్చని వివరించారు. ​ఈ కార్యక్రమంలో ఏ.ఆర్ డీఎస్పీతో పాటు ఆర్ ఐ లు మధు, పవన్ కుమార్, ఆర్ ఎస్ ఐ లు జాఫర్ ( పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు) బాబ్జాన్ , రమేష్ నాయక్ , జిల్లా పోలీసు అధికారుల సంఘం అడహక్ కమిటీ సభ్యులు సాకే త్రిలోకనాథ్ , గాండ్ల హరినాథ్ , శివప్రసాద్ , ఆనంద్ మరియు కిమ్స్ సవీరా ఆసుపత్రి ప్రతినిధులు, వైద్య బృందం, మరియు పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు