Homeజిల్లాలుశ్రీ సత్యసాయిపాండురంగ స్వామి అభివృద్ధి పనులు ఎప్పుడో….?

పాండురంగ స్వామి అభివృద్ధి పనులు ఎప్పుడో….?

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్లో గల అతి పురాతనమైన పాండురంగ స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులు నోచుకోకపోవడంతో భక్తాదులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక సంవత్సరం కిందట ప్రభుత్వం కోటి రూపాయలు నిధులు ఇచ్చినా కూడా, కమిటీ ఏమాత్రం పట్టించుకోవడంలేదని భక్తాదులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా నిర్మాణ కట్టడానికి కావలసిన అతి బరువైన పెద్ద పెద్ద రాతి దూలాలు రోడ్డు పక్కనే ఉండడంతో, ప్రయాణికులు బాటసారులు, వాహనదారులు, ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కోటి రూపాయల నిధులను అభివృద్ధి చేయడంలో ఆలయ కమిటీ నిర్లక్ష్య ధోరణికి అడ్డం పడుతుందని భక్తాదులు వాపోతున్నారు. ఇప్పటికైనా దేవాదాయ శాఖ అధికారులు ఆలయ నిర్మాణ పనులను చేపట్టి, ఆలయ సమస్యలను తీర్చాలని భక్తాదులు, పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు