Homeజిల్లాలుశ్రీ సత్యసాయిగంజాయి వినియోగం, అసాంఘిక కార్యకలాపాలపై కఠినంగా వ్యవహరిస్తాం..

గంజాయి వినియోగం, అసాంఘిక కార్యకలాపాలపై కఠినంగా వ్యవహరిస్తాం..

- Advertisement -

వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ రెడ్డప్ప
విశాలాంధ్ర ధర్మవరం ; ధర్మవరం పట్టణంలో గంజాయి వినియోగం పై కఠిన చర్యలు తప్పకుండా తీసుకుంటామని, గంజాయిని వినియోగించే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సీఐ రెడ్డప్ప తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోలీసులు మరింత కఠినంగా వ్యవహరించనున్న నేపథ్యంలో, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి అనుమానాస్పద ఘటనలపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి అని తెలిపారు. పట్టణంలో గంజాయి వినియోగం మరియు ప్రజలకు ఇబ్బందులు కలిగించే అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు. గంజాయి సేవించి ఇతరులకు ఇబ్బందులు కలిగిస్తున్న వ్యక్తుల గురించి సమాచారం ఉంటే వెంటనే డయల్ 100కు ఫోన్ చేసి పోలీసులకు తెలియజేయాలని తెలిపారు. గంజాయి సేవించిన వారిని గుర్తించేందుకు పోలీసుల వద్ద ప్రత్యేక టెస్టింగ్ కిట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఆ కిట్ల ద్వారా మూత్ర నమూనాలను పరీక్షించి, సంబంధిత వ్యక్తి గంజాయి సేవించాడా లేదా అనే విషయాన్ని నిర్ధారించవచ్చని తెలిపారు.అదేవిధంగా, దుర్గమ్మ దేవాలయం పరిసర ప్రాంతం, తిక్కస్వామి ప్రాంతాల్లో కొందరు వ్యక్తులు మద్యం సేవించి అల్లర్లు సృష్టించడం, అక్కడికి వచ్చే మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారనే ఫిర్యాదులు అందాయని వారువెల్లడించారు.
ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు పాల్పడినా, చట్టాన్ని చేతిలోకి తీసుకున్నా, వారి మీద చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చట్ట అమలులో ఎలాంటి రాజీ ఉండదని, శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని వారు స్పష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు