ఐసీసీ ర్యాంకింగ్స్‌లో దుమ్మురేపిన శ్రీ చరణి..
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శనతో దూసుకుపోతున్న భారత యువ స్పిన్ సంచలనం నల్లపురెడ్డి శ్రీ చరణి అంతర్జాతీయ క్రికెట్ మండలి తాజా ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది.
కేవలం ఏడాది క్రితమే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన ఈ 21 ఏళ్ల ఆంధ్రప్రదేశ్ సంచలనం, ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్‌గా నిలిచి సరికొత్త చరిత్ర సృష్టించింది. ప్రపంచ నెంబర్ 1 ఉమన్ టీ20 బౌలర్‌గా నిలిచింది. తాజా అంతర్జాతీయ టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్‌లో ఇంగ్లాండ్ స్పిన్నర్ లిన్సే స్మిత్‌ను అధిగమించి అగ్రస్థానానికి ఎగబాకింది. తాజా టీ20 ప్రపంచకప్‌లో మూడు మ్యాచ్‌లు ఆడిన శ్రీచరణి 10 వికెట్లు పడగొట్టింది. నిరుడు జూన్ 28న ఇంగ్లండ్‌తో మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్లోకి అడుగుపెట్టింది.
శ్రీచరణి ప్రపంచ నంబర్ 1 ఉమన్ టీ20 బౌలర్‌గా నిలవడంపై ఏపీ మంత్రి నారా లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు. ‘‘ యావత్ రాష్ట్రం నిన్ను చూసి గర్విస్తోంది. మరిన్ని రికార్డులు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’ అని ఎక్స్‌లో పోస్టు చేశారు.


