Homeజిల్లాలుఅనంతపురంజేఎన్టీయూ బోధన ఉద్యోగ నియామక సవరణలు

జేఎన్టీయూ బోధన ఉద్యోగ నియామక సవరణలు

- Advertisement -

విశాలాంధ్ర – జేఎన్టీయూ ఏ: జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం బోధన ఉద్యోగ నియామక ప్రక్రియలో ఆధ్వర్యంలో ఆద్యాపకుల ఉద్యోగాల భర్తీకి జారీ చేసిన ప్రకటనలలో.. గడువు తేదీలలో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం సవరణలు చేస్తున్నట్లు ఉపకులపతి ఆచార్య హెచ్. సుధర్శన రావు , రిజిస్ట్రార్ ఆచార్య ఎస్. కృష్ణయ్య తెలిపారు. సవరణల తేదీలు ఇలా ఉన్నాయి.. ప్రాథమిక అర్హత , అనర్హత కలిగిన దరఖాస్తుదారుల జాబితా ప్రదర్శన జూలై 14న, అభ్యంతరాల స్వీకరణ జూలై 21 , తుది జాబితా ప్రదర్శన జూలై 27న వెబ్సైట్లో పొందుపరిచినట్లు తెలిపారు. తపాలా శాఖ పార్శిల్స్ డెలివరీలో ఏర్పడిన జాప్యాలపై అధికారులు వ్యక్తం చేసిన ఆందోళనలను, అభ్యర్థుల నియంత్రణలో లేని కారణాల వల్ల వారికి ఎటువంటి నష్టం కలగకూడదనే ఉద్దేశ్యంతో జూన్ 22 , అంతకు ముందు పోస్టు,కొరియర్ లో పంపబడిన దరఖాస్తుల హార్డ్ కాపీలను, పంపిన తేదీ , ఇతర అర్హత నిబంధనలను ధృవీకరించిన అనంతరం పరిగణనలోకి తీసుకోవాలని విశ్వవిద్యాలయం నిర్ణయించినట్లు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు