విశాలాంధ్ర ధర్మవరం;; రోటరీ క్లబ్ ద్వారా ధర్మవరంలో గొప్ప సేవకు నిరతి అని రోటరీ క్లబ్ ప్రతినిధులు నరేందర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ ధర్మవరం వారు రెడ్ క్రాస్ మెంబర్ అయినటువంటి సత్య నిర్ధారణ మన రొటీరి సభ్యులు సోలిగాళ్ళ వెంకటేశులు సహాయ సహకారాలతో కీర్తిశేషులు చెన్నకేశవరెడి అలియాస్ ఉత్తపయ్య రెడ్డి, కీర్తిశేషులు నరసింహమూర్తి కుటుంబ సభ్యులకు నేత్రదానం గురించి అవగాహన కల్పించి, వారి అనుమతితో అనంతపురం కు చెందిన రెడ్ క్రాస్ అసోసియేషన్ టెక్నీషియన్ రాఘవ చేత కార్నియా రిమూవ్ చేయించి వారి కుటుంబ సభ్యుల చేతుల మీదుగా డొనేట్ చేయడం జరిగినది అని తెలిపారు. ఇందులకు ముఖ్యపాత్రగా రొటీరి సభ్యుడు శివయ్య రోటరీ మిత్రులందరికి తెలియజేయగా రోటరీ సభ్యులైనటువంటి శ్రీనివాసరెడ్డి, వైస్ ప్రెసిడెంట్ జయసింహ , సుదర్శన్ గుప్తా , పట్టణ ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ నరసింహులు పాల్గొన్నారు .డాక్టర్ నరసింహులు ఈ రెండు కుటుంబాలకు, నేత్రదాన విలువలను తెలియజేస్తూ, కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతపురం నుంచి విచ్చేసిన, టెక్నీషియన్ రాఘవ , నరేంద్ర రెడ్డి, శివయ్య అసిస్ట్ చేశారు. రోటరీ క్లబ్ ద్వారా నేత్రదానం తో పాటు ఉచిత కంటి పరీక్షలు ఆపరేషన్లు నిర్వహిస్తున్నామని వారు స్పష్టం చేశారు.
రోటరీ క్లబ్ ధర్మవరం వారి గొప్ప సేవ నిరతి.. నరేందర్ రెడ్డి
- Advertisement -
RELATED ARTICLES


