Homeవిశ్లేషణచైనాలో పశ్చిమ బ్రాండ్స్‌ పలాయనం

చైనాలో పశ్చిమ బ్రాండ్స్‌ పలాయనం

- Advertisement -

బీజింగ్‌లోని ఆపిల్ స్టోర్లు ఖాళీగా ఉన్నాయి, నైక్ షూ షోరూమ్‌లు దుమ్ము పడుతున్నాయి, స్టార్బక్స్‌ కాఫీ కనుమరుగైంది. ఇవన్నీ జరుగుతుంటే ట్రంప్ కేవలం చూస్తూ ఉండటం తన పనైంది, ఇది వాణిజ్య యుద్ధం కాదు, చైనా ప్రతీకారం తీర్చుకుంటోంది. ఇది కేవలం వాణిజ్య యుద్ధం మాత్రమే కాదు, దీని పరిధి అంతకంటే చాలా పెద్దది. చైనా క్షిపణులతో గానీ, ఆంక్షలతో గానీ కాకుండా, అంతకంటే శక్తిమంతమైన మరో మార్గంలో ఎదురు దాడి చేస్తోంది. దాని సొంత జేబులతో! పాశ్చాత్య ఆర్థికవేత్తలు, కార్పొరేట్ అధికారులు, పాశ్చాత్య వాణిజ్య విధాన రూపకర్తలు పూర్తిగా నిస్సహాయులవుతున్నారు. ప్రస్తుతం చైనాలో జరుగుతున్న పరిణామాలు రాబోయే 50 ఏళ్లలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మిస్తాయి. కానీ పశ్చిమ దేశాల్లోని చాలా మందికి దీని గురించి ఏమాత్రం అవగాహన లేదు. అమెరికా సుంకాల యుద్ధాలు, చిప్స్‌ నిషేధాలు, టెక్నాలజీ బ్లాక్లిస్ట్ వంటి అంశాలు దౌత్యపరంగా ఉద్రిక్తతలను వేగవంతం చేస్తున్న నేపథ్యంలో, చైనా దౌత్యవేత్తలు తమ బ్రాండ్స్‌ ఉత్పత్తులతో కొన్ని చర్యలు తీసుకుంటున్నారు. చైనా ప్రజలు పాశ్చాత్య బ్రాండ్‌ల కంటే చైనీస్ ఉత్పత్తులను స్వచ్ఛందంగా, అత్యంత ఉత్సాహంగా, గర్వంగా ఎంచుకుంటున్నారు. అమెరికా గూగుల్ సేవలతో తన దిగుమతులను తగ్గించుకోవడానికి, చైనా కంపెనీ హువావేను ఎంచుకుంది. హువావే దేశీయంగా ఉత్పత్తి చేసిన చిప్‌తో ఒక మొబైల్ ఫోన్‌ను విడుదల చేసింది, అది రోజుల్లో కాదు, గంటల్లోనే అమ్ముడైపోయింది. ఈ పరిణామాలు సిలికాన్ వ్యాలీలో ప్రకంపనలు సృష్టించాయి, ఎందుకంటే ఇది అమెరికన్ టెక్ కంపెనీలను ఎంతగానో భయపెట్టింది, ఇకపై అమెరికా చిప్స్‌ అవసరం వారికి లేదని నిరూపించింది. చైనా లూకింగ్ కాఫీ ఇప్పుడు దేశంలోని ప్రతి మూలలో ఉన్న చైనీయులకు నచ్చిందని నిరూపించింది. పాశ్చాత్య స్టార్బక్స్‌ బ్రాండ్ స్థానంలో లూకింగ్ కాఫీ వచ్చింది. ఇప్పుడు చైనాలో, బివైడీ (బిల్డ్ యువర్ డ్రీమ్స్‌) అనే ఎలక్రిట్కల్ కార్ బ్రాండ్ ప్రపంచ వ్యాప్తంగా టెస్లాతో పోటీ పడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా యువతరం ఈ కార్లను ఇష్టపడుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా టెస్లా కార్ల కంటే బివైడీ కార్లు ఇప్పుడు ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. చైనీయులు ఇకపై పాశ్చాత్య బ్రాండ్‌లను కొనడానికి సిద్ధంగా లేరు, ఆ రోజులు పోయాయి. చైనీస్ బ్రాండ్‌లను కొనడం వెనుక జాతీయ గుర్తింపు, ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం వంటి లోతైన భావాలు ఉన్నాయి. ఈ ఉద్యమానికి ‘గోచావ్’ అనే పేరు కూడా ఉంది, దీనిని ‘జాతీయ ధోరణి’ అని అనువదిస్తారు. ఇది, ప్రపంచంతో తమను తాము చూసుకునే విషయంలో వినియోగదారుల తరాల్లో వచ్చిన ఒక ప్రాథమిక మార్పును సూచిస్తుంది. గృహ ఫ్యాషన్ లేబుల్స్‌, చర్మ సంరక్షణ బ్రాండ్‌లు, ఆహార కంపెనీలు, టెక్ ఉత్పత్తులు ఇప్పటికే చైనా బ్రాండ్‌ల దారి పట్టాయి. ఇది ఒక సాంస్కృతిక భూకంపం. న్యూయార్క్క, టోక్యో, పారిస్, బెర్లిన్ నగరాలు ప్రకంపనలు సృష్టించాయి, కానీ ఇప్పుడు మనం ఒక విషయం నిజాయితీగా మాట్లాడుకుందాం. వాణిజ్య యుద్ధం ట్రంప్‌తో ప్రారంభం కాలేదు, దానికి బీజాలు ఎప్పుడో పడ్డాయి కానీ అప్పటికే మండుతున్న నిప్పుపై ట్రంప్ పెట్రోల్ పోశారు. అమెరికా చైనీస్ కంపెనీలపై ఆంక్షలు విధించినప్పుడల్లా, వాషింగ్టన్ టెక్నాలజీ బదిలీ ఆరోపణలతో వాటిని బ్లాక్లిస్ట్ చేసింది. ప్రతిసారీ కొత్త విడత సుంకాలను ప్రకటించింది. చైనీస్ వినియోగదారులు దీనిని వ్యక్తిగతంగా ఎదుర్కొన్నారు. వాషింగ్టన్ దీనిని జాతీయ భద్రతా విధానంగా అభివర్ణించినప్పటికీ, సాధారణ చైనా పౌరులు దీనిని తమ దేశంపై, తమ భవిష్యత్తుపై నేరుగా చేసిన ఆర్థిక దురాక్రమణగా భావించారు. చైనీయులు ఏమి చేశారు ? వినియోగదారులు చేయగలిగిన ఏకైక మార్గంలో, అంటే వారి జేబుల్లో ఉన్న డబ్బుతో స్పందించారు. అమెరికా తమ అధునాతన చిప్ల ఎగుమతులను పరిమితం చేసినప్పుడు, చైనా పౌరులు వీధుల్లోకి వచ్చి నిరసన తెలపలేదు కానీ వారు హువావే ఉత్పత్తులను కొనుగోలు చేశారు. అమెరికన్, యూరోపియన్ బ్రాండ్‌లు చైనా జాతీయ గుర్తింపుతో విభేదించే భౌగోళిక-రాజకీయ సమస్యలపై బహిరంగ ప్రకటనలు చేసినప్పుడు, వారు సుదీర్ఘమైన ఆన్‌లైన్ జాతీయ చర్చలలో పాల్గొనలేదు. కేవలం వేర్వేరు స్వ¹<శీ యాప్లు, వేర్వేరు బ్రాండ్‌లను తెరిచి ముందుకు సాగారు. చైనా భౌగోళిక-రాజకీయ సమస్యలను ప్రజల కొనుగోలు నిర్ణయాలుగా మార్చింది. ఆ నిర్ణయాలు ప్రతి నెలా చక్కటి ఫలితాలను ఇస్తున్నాయి. పాశ్చాత్య సంస్థలకు ఇది ఒక పీడకల వంటి పరిస్థితి, వారు తమ ఉత్పత్తులను రక్షించుకోవడానికి దశాబ్దాలుగా బిలియన్ల డాలర్లు ఖర్చు చేశారు. ఆపిల్, నైక్, జనరల్ మోటార్స్, వోల్క్కస్వ్యాగన్ వంటి కంపెనీలు, చైనాలో పెరుగుతున్న 40 కోట్ల మందికి పైగా మధ్య తరగతి ప్రజలు పాశ్చాత్య వస్తువులనే వినియోగిస్తూ ఉంటారనే ఒకే ఒక్క మినహాయింపుతో తమ దీర్ఘకాలిక వ్యూహాలను రూపొందించుకునేవి. ఆ మినహాయింపు ఇప్పుడు కరిగిపోతోంది. హువావే, ఇతర బ్రాండ్‌లు పుంజుకోవడంతో చైనాలో ఆపిల్ మార్కెట్ వాటా తీవ్రంగా పడిపోయింది. ఒకప్పుడు కార్ల పరిశ్రమలో ఆధిపత్యం చెలాయించిన జనరల్ మోటార్స్ ఇప్పుడు పతనమై, దాని స్థానంలో చైనీస్ ఎలక్రిట్కల్ వాహనాలు వచ్చాయి. పాశ్చాత్య దేశాల లగ్జరీ రంగ బ్రాండ్‌లు కూడా చైనా నుంచి తరలిపోక తప్పలేదు, వాటి స్థానాల్లో చైనా ఉత్పత్తులొచ్చాయి. చైనా ఉత్పత్తులను ఏ కార్పొరేట్ సంస్థ కూడా భర్తీ చేయలేదనేది కఠోర వాస్తవం. ఆ మార్కెట్ మూడు దశాబ్దాల పెట్టుబడులు, సంబంధాలు, స్థానికీకరణ, ఉత్పత్తులను అభివృద్ధి చేయడానికి చూపిన సహనంపై ఆధారపడి ఉంది. చైనా చేసినట్లుగా, భారతదేశం లేదా దక్షిణాసియాలో కేవలం 5 ఏళ్లలో అదే విధానాన్ని యథాతథంగా అమలు చేయడం సాధ్యం కాదు. చైనా ఒక దీర్ఘకాలిక వ్యూహాన్ని అమలు చేస్తోంది, దీనిని ఆర్థికవేత్తలు సమాంతర ప్రపంచ వ్యవస్థ అని పిలుస్తున్నారు, ఇది పాశ్చాత్య సాంకేతికత, పాశ్చాత్య ఆర్థిక మౌలిక సదుపాయాలు, పాశ్చాత్య సరఫరా గొలుసుల నుంచి పూర్తిగా స్వతంత్రంగా ఉంటుంది. దీని అసలు అర్థం ఏమిటంటే, చైనా ఎస్ఎమ్ఐసి వంటి కంపెనీల ద్వారా తన సొంత అధునాతన సెమీకండక్టర్ చిప్లను అభివృద్ధి చేస్తోంది. తద్వారా తైవాన్పై ఆధారపడటాన్ని తగ్గించుకుంటూ చిప్ల ఎగుమతి నియంత్రణ ప్రభావాన్ని తొలగిస్తోంది. ( పొలిటికల్ షిఫ్ట్ సౌజన్యంతో )

ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం జాతీయ కార్యవర్గ సభ్యులు
సెల్ : 9849491969

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు