Homeసాహిత్యంఆచార్య రాచపాళెంకు అడిగోపుల సాహిత్య ప్రతిభాపురస్కారం

ఆచార్య రాచపాళెంకు అడిగోపుల సాహిత్య ప్రతిభాపురస్కారం

- Advertisement -

ప్రసిద్ధ అభ్యుదయ కవి అడిగోపుల వెంకటరత్నం పేరున ఆయన కుటుంబసభ్యులు నెలకొల్పిన “అడిగోపుల సాహిత్య ప్రతిభాపురస్కారం” 2026వ సంవత్సరానికి గాను ప్రసిద్ధ అభ్యుదయ సాహిత్య విమర్శకులు ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డికి ఇవ్వాలని నిశ్చయించారు. జులై నెల రెండవవారంలో తిరుపతిలో జరిగే ఒక ప్రత్యేక కార్యక్రమంలో ఈ పురస్కారం రాచపాళెంకు అందజేస్తారు.
అరÆ శతాబ్ద కాలం సాహిత్య సేవలో ముప్‌పై గ్రంథాలతో అభ్యుదయ కవిత్వాన్ని సమృద్ధి చేసిన అడిగోపుల వెంకటరత్నం స్మారక పురస్కారం, తెలుగు సాహిత్య విమర్శను అరÆ శతాబ్ద కాలం విశాలపరిచిన ఆచార్య రాచపాళెంకు అందజేయడం సముచితంగా భావిస్తున్నాము.
అర్థ శతాబ్దం నుంచి మొక్కవోని దీక్షతో సాహిత్య విమర్శకు అంకితమైన ఆచార్య రాచపాళెం తెలుగు నేలంతా తెలిసిన విమర్శకులు. ప్రాచీన ఆధునిక సాహిత్యాలను తనదైన భావజాలంతో నిరంతరం విశ్లేషించే రాచపాళెం ఎందరో యువ రచయితలకు ప్రోత్సాహమిస్తున్నారు.
ప్రాచీన కవిత్వం, ఆధునిక కవిత్వం, నవల, కథానిక, నాటకం, సాహిత్య విమర్శ, దాక్షిణాత్య సాహిత్యం, భారతీయ సాహిత్యం వంటి అనేక ముఖాలుగా తెలుగు సాహిత్య విమర్శను విస్తరింపజేస్తున్న విమర్శకులు రాచపాళెం మా పురస్కారానికి అన్ని విధాలా తగిన వారని మా నమ్మకం.
రాచపాళెం రచించిన “దరిదాపు” గ్రంథం ఎం.ఏ తెలుగు విద్యార్థులకు పాఠ్యగ్రంథమైంది. ఆచార్య హెచ్.ఎస్.బ్రహ్మానందతో కలిసి రచించిన “సాహిత్య బోధనా పద్ధతులు” సాహిత్య అధ్యాపకులకు, “సాహిత్య పరిశోధన సూత్రాలు” సాహిత్య పరిశోధకులకు నిత్యం ఉపయోగంలో ఉన్నాయి. ఆయన పర్యవేక్షణలో నలభైమంది విద్యార్థులు పరిశోధన చేశారు. “మన నవలలు మన కథానికలు” అనే గ్రంథానికి 2014లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. అటువంటి విమర్శకునికి అడిగోపుల పేరుతో పురస్కారం ఇవ్వడం ఎంతో సముచితంగా ఉందని భావిస్తున్నాం.
అడిగోపుల శ్రీకాంత్ మరియు కుటుంబ సభ్యులు
సాహిత్య Ê సాంస్కృతిక వ్యవహారాల సంచాలకుడు, తెలుగు సందడి, సిడ్నీ.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు