Homeజిల్లాలుశ్రీ సత్యసాయిజాతీయ మెగా లోక్ అదాలత్ విజయవంతం చేయండి..

జాతీయ మెగా లోక్ అదాలత్ విజయవంతం చేయండి..

- Advertisement -

సీనియర్ సివిల్ జడ్జ్ వెంకటేశ్వర్లు
విశాలాంధ్ర ధర్మవరం; జూలై 11వ తేదీన నిర్వహించే జాతీయ మెగా లోక్ అదాలత్ ను పోలీసులు న్యాయవాదులు సమన్వయంతో కృషిచేసి విజయవంతం చేయాలని సీనియర్ సివిల్ జడ్జ్ అండ్ చైర్మన్ వెంకటేశ్వర్లు, ప్రిన్సిపుల్ జూనియర్ సివిల్ జడ్జ్ నందిని, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ వెంకట హరీష్, సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ రాజశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా కోర్టు ఆవరణములో ఉదయం న్యాయవాదుల బార్ అసోసియేషన్ కమిటీ, సభ్యులు, సీనియర్ జూనియర్ న్యాయవాదులతో సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం పోలీస్ అధికారులు, కోర్టు డివిజన్లోని ఆయా పోలీస్ స్టేషన్లో సీఐ ఎస్ఐ కానిస్టేబుల్ లతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జీలు మాట్లాడుతూ జాతీయ మెగా లోక్ అదాలకు విజయవంతం చేయుటలో పోలీస్ శాఖ, న్యాయవాదులు కీలకపాత్ర ఉంది అని తెలిపారు. కక్ష దారులతో న్యాయవాదులు రాజీకు వచ్చే కేసులను మాత్రమే చేపట్టాలని తెలిపారు. అదేవిధంగా పోలీస్ అధికారులు కూడా తమ కక్ష దారులు లోకదాలతో పై అవగాహన కల్పించి విజయవంతం కావుటలో తమ వంతు కృషి ఎంతో అవసరమని తెలిపారు. కేవలం రాజీకు తగ్గ కేసులు మాత్రమే లోక్ అదాలత్ లో రావాలని, ఎక్సైజ్, బ్యాంకు, భార్యాభర్తల తగాదా, రహదారుల తగాదా, ప్రామిస్రీ నోట్ కేసులు లాంటివి రాజీకు తగ్గ కేసుల్లాగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు లక్ష్మీనారాయణతో పాటు కమిటీ సభ్యులు, సీనియర్, జూనియర్ న్యాయవాదులు, వివిధ పోలీస్ స్టేషన్లో సిబ్బంది, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు