విశాలాంధ్ర ధర్మవరం; పట్టణంలోని కాకతీయ విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు 2026_2027 విద్యా సంవత్సరానికి సంబంధించి పాఠశాల విద్యార్థిని విద్యార్థుల కొరకై.. విద్యార్థులకు ప్రజాస్వామ్య విధానం పట్ల అవగాహన కల్పించే ఉద్దేశంతో మాక్ ఎలక్షన్స్ (ప్రత్యక్ష ఎన్నికలు) నిర్వహించారు. విద్యార్థులు స్కూల్ ప్యూపిల్ లీడర్,అసిస్టెంట్ స్కూల్ ప్యూపిల్ లీడర్, కల్చరల్ , స్పోర్ట్స్ కమిటీ పదవుల కోసం పోటీపడ్డారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ నిర్మలాదేవి మాట్లాడుతూ ప్రజాస్వామ్య విధానాల పట్ల విద్యార్థుల ప్రాథమిక అడుగుల కోసం విద్యార్థులకు చిన్ననాటి నుండే ప్రజాస్వామ్య విలువలపై అవగాహన కలిగించడం కోసం ఈ మాక్ ఎన్నికలు పాఠశాలలో నిర్వహించామని తెలిపారు.
పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ శెట్టిపి పద్మ , డైరెక్టర్స్ శెట్టిపి సూర్య ప్రకాష్ రెడ్డి, శెట్టిపి హార్జిత్ ప్రణవ్ రెడ్డి, మాట్లాడుతూ ఈ తరహా కార్యక్రమాల ద్వారా విద్యార్థులలో నాయకత్వ లక్షణాలు, బాధ్యతాయుతమైన నిర్ణయాలు తీసుకునే శక్తి పెంపొందుతాయని తెలిపారు.కాకతీయ పాఠశాలలో జరిగిన ఈ మాక్ ఎలక్షన్స్ వల్ల పాఠశాల ప్రాంగణం ఎన్నికల హోరాహోరీనీ తలపించేలా ఓటర్లు, ఏజెంట్లు, బ్యాలెట్ బాక్సులు, ఓటింగ్ పోలింగ్ స్టేషన్, ఇలా ప్రతి అంశం వాస్తవ ఎన్నికలను నిర్వహించే విధానంలోనే తీర్చిదిద్దారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.
ఎన్నికల అనంతరం నూతనంగా ఎన్నికైన విద్యార్థుల బృందమును ఉపాధ్యాయ బృందం అభినందనలు తెలియజేశారు.
కాకతీయ విద్యానికేతన్ పాఠశాలలో మాక్ ఎలక్షన్స్
- Advertisement -
RELATED ARTICLES


