-రూ.1.50 లక్షల డిపాజిట్
-1996 – 97 ….10వ తరగతి ఎస్పీసీఎస్ రైల్వే స్కూల్ బ్యాచ్ విద్యార్థుల సహాయం
విశాలాంధ్ర ధర్మవరం : స్నేహానికి నిలువెత్తు నిదర్శనంగా 1996-97 పదో తరగతి బ్యాచ్ మిత్రులు తమ తోటి మిత్రుడు చిరంజీవి కుటుంబానికి అండగా నిలిచారు. డయాలసిస్ చికిత్స పొందుతున్న చిరంజీవి కుటుంబ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, ఆయన కుమార్తె హనీ దీక్షిత భవిష్యత్తు ఉన్నత చదువులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ముందుచూపుతో రూ.1.50 లక్షలను కెనరా బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్‌గా జమ చేశారు.ఈ సందర్భంగా మిత్రులు మాట్లాడుతూ చిరంజీవి ఆరోగ్య పరిస్థితి కారణంగా కుటుంబంపై ఆర్థిక భారం పడిందని, అలాంటి సమయంలో ఆయన కుమార్తె విద్యకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఈ సహాయం అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రిటైర్డ్ హెడ్మాస్టర్ వెంకటప్ప మాట్లాడుతూ హనీ దీక్షిత ఉన్నత విద్యను అభ్యసించి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.ఈ సహాయ కార్యక్రమాన్ని మిత్రులు అభినందిస్తూ, నిజమైన స్నేహం అంటే కష్టకాలంలో అండగా నిలవడమేనని రిటైర్డ్ హెడ్మాస్టర్ వెంకటప్ప ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో చేనేత ప్రముఖులు, టిడిపి యువ నాయకులు సంధా రాఘవ, జింకాపురుషోత్తం, లోకనాథ్, జయ రాములు, హరి, పరంధామ, నాగవేణి, గోవిందమ్మ, గాయత్రి, ఫక్రునిస తదితరులు పాల్గొన్నారు.


