డిఇఓ క్రిష్టప్ప
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని సంజయ్ నగర్ లో గల బిఎస్సార్ పురపాలక బాలికల ఉన్నత పాఠశాలలో త్రిబుల్ ఐటీ కు 19 మంది విద్యార్థినీలు ఎంపిక కావడం గర్వించదగ్గ విషయమని డిఇఓ కిష్టప్ప తెలిపారు. ఈ సందర్భంగా వారు ఆకస్మికంగా పాఠశాలను తనిఖీ చేస్తూ, వివిధ రికార్డులను పరిశీలించారు. పాఠశాల మెయింటెన్స్ పట్ల వారు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ హెడ్మాస్టర్ జ్యోతిలక్ష్మిని అభినందించారు. అనంతరం వారు మాట్లాడుతూ పాఠశాలకు కావలసిన మౌలిక సదుపాయాలు కల్పించడం తోడ్పాటు అందిస్తామని వారు హామీ ఇచ్చారు. బాలికల పాఠశాల కాబట్టి అందర్నీ సమానంగా చూస్తే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు పడాలని ఉపాధ్యాయులకు సూచించడం జరిగింది అన్నారు. అంతేకాకుండా పాఠశాలలో ఉన్న ఈ విద్యార్థినిలు అందరినీ ఉపాధ్యాయులు తమ సొంత కుమార్తెల లాగా చూసుకోవలసిన బాధ్యత ఎంతైనా ఉందని తెలిపారు. ఇప్పటికే జిల్లాతో పాటు రాష్ట్రస్థాయిలో ఈ పాఠశాల ఓ మంచి గుర్తింపు రావడం మా జిల్లాకు గర్వకారణం అని వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఎటువంటి పరిస్థితుల్లో ఎలాంటి సంఘటనలు జరగకుండా, కేవలం ఉపాధ్యాయులందరూ బోధనపైనే శ్రద్ధ వహించాలని తెలిపారు. పాఠశాల సమస్యలు ఏవైనా ఉన్న ఎడల నాకు విలువెంటనే తెలియజేయాలని, వీలైనంత త్వరగా సమస్యలు పరిష్కరిస్తారని వారు హామీ ఇచ్చారు. తదుపరి 19 మంది విద్యార్థులకు ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతూ, ఇందుకు కృషి చేసిన ఉపాధ్యాయులను, హెడ్మాస్టర్ లను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ గోపాల్ నాయక్ తో పాటు పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
19 మంది త్రిబుల్ ఐటీ సాధించడం గర్వించదగ్గ విషయం..
- Advertisement -
RELATED ARTICLES


