Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఎస్ ఐ ఆర్ ఫై సర్వత్ర ఉత్కంఠ…!

ఎస్ ఐ ఆర్ ఫై సర్వత్ర ఉత్కంఠ…!

- Advertisement -

జూలై 14 గడువు సమీపిస్తుండడంతో బిఎల్ఓలో తీవ్ర ఒత్తిడి
వివిధ రాజకీయ పార్టీ నాయకులు కూడా హడావుడి

విశాలాంధ్ర -ధర్మవరం;; కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించిన ఎస్ఐఆర్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొల్తోంది.. జూలై 14 కు కేవలం రెండు రోజులు మాత్రమే గడువు ఉండడంతో బిఎల్ఓలో తీవ్ర ఒత్తిడి కొనసాగుతోంది. ఓటర్లలో కూడా కొంతవరకు అయోమయం కనిపిస్తోంది. బిఎల్ఏలు, బి ఎల్ వో లు వేగవంతంగా ఈ కార్యక్రమం నిర్వహించడం పూర్తిగా నిమగ్నమయ్యారు. ప్రతి ఓటరు తన వెన్యూమినేషన్ ఫారం పూర్తి చేయించాలనే లక్ష్యంతో ఎన్నికల యంత్రాంగం శ్రమిస్తుండగా క్షేత్రస్థాయిలో కొన్ని సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. 2002 ఓటర్లు జాబితాను ప్రాతిపదికంగా తీసుకొని ఎన్నికల సంఘం ఈ ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అయితే రెండు దశాబ్దాల కాలంలో రాష్ట్ర విభజన గ్రామాల పునర్విభజన పట్టణీకరణ ఉపాధి కోసం వలసలు మరణాలు చిరునామాల మార్పులు వంటి వివిధ కారణాలతో పాత జాబితాలోని వివరాలు ప్రస్తుతం వాస్తవ పరిస్థితులకు పూర్తిగా చనిపోవడం లేదని ఓటర్లు తెలుపుతున్నారు. చాలామంది ఓటర్ల పేర్లు జాబితాలో లేకపోవడం లో ఓటర్లు ఆందోళన చెందుతున్నారు. అంతేకాకుండా కొంతవరకు పేర్లు కూడా తప్పుగా ఉండడం మరికొందరి పేర్లు ఇతర నియోజకవర్గాల్లో కనిపించకపోవడం లాంటి సమస్యలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. వీటికి సంబంధించిన అధికారులు కూడా బిఎల్ఓ లకు, బి ఎల్ ఏ లకు తగిన అవగాహన సదస్సు కూడా నిర్వహించిన కూడా, కొన్నిచోట్ల ఎదుర్కోక తప్పలేదు. అంతేకాకుండా ఓటరుకు సంబంధించిన ఎనిమిదేషన్ ఫారం నింపడం సులభమైన కూడా, అందులో అడిగిన వివరాలు అవసరమైన పత్రాలు వంటి అంశాలపై చాలామందికి స్పష్టత లేకపోవడం వల్ల ఫారాలు అసంపూర్తిగా ఉండబోతున్నాయి. ముఖ్యంగా పట్టణము, గ్రామీణ ప్రాంతాలలో వికలాంగులు, వృద్ధులు, నిరక్షరాస్యులు, ఉపాధి కోసం ఎంతోమంది కుటుంబాలు అధికంగా ఉండడంతో, విధి లేని పరిస్థితుల్లో బిఎల్వోలు ఇంటింటికి వెళ్లి వివరాలను సేకరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. వివరాలు నింపిన తర్వాత ఆన్లైన్లో పొందుపరచడంలో సర్వర్ కూడా అనుకూలించడం లేదని బిఎల్వోలు వాపోతున్నారు. ఒకవైపు సాధారణ ఎన్నికల విధులు మరోవైపు శాఖపరమైన బాధ్యతలు కొనసాగుతుండడంతో చాలామంది బిఎల్వోలు ఉదయం నుంచి రాత్రి వరకు కార్యాలయంలోనూ, ఇంటి యందు కూడా చేయక తప్పడం లేదు. యేసయ్య ప్రక్రియ మొదలుపెట్టిన తర్వాత అధికార పార్టీ ప్రతిపక్ష రాజకీయ పార్టీలు కూడా తమ కార్యకర్తలను రంగంలోకి దించాయి. ఒక్కరి ఓటు కూడా పోకుండా ఎన్నో జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు. ఇందుకు కలెక్టర్ కూడా చాలా సీరియస్ గా జులై 14 వ తేదీ లోపు తప్పనిసరిగా ఈ ఎస్ ఐ ఆర్ ప్రక్రియ పూర్తి చేయాల్సిందేనని తెలుపుతున్నారు. జూలై 11, జులై 12 ప్రత్యేక కార్యక్రమంగా బిఎల్వోలు బిజీబిజీగా తమ విధులను నిర్వర్తిస్తున్నారు. పర్యవేక్షణ అధికారులు, ఈ ఆర్ వో లు, ఆర్డీవోలు, ఎమ్మార్వోలు, ఎంపీడీవోలు, ప్రతి గంటకు ఎన్ని పూర్తి అయ్యాయి అన్న సమాచారాన్ని కూడా సేకరిస్తున్నారు. ఇక ఓటర్ల సందేహాలకు కలెక్టర్ ప్రత్యేక ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని కూడా నిర్వహించి ఓటర్ల సందేశాలకు నేరుగా సమాధానాలు కూడా ఇస్తున్నారు. తప్పులు ఉంటే ఎలా సవరించుకోవాలి వంటి అనేక ప్రశ్నలకు అధికారులకు కూడా ఇటీవల వివరణ ఇవ్వడం జరిగింది. జులై 14 కాకుండా మరిన్ని రోజులు గడువు పొడిగించాలని పలువురు కోరుతున్నారు. మరికొంత గడువు ఇచ్చినట్లయితే మరింత మంది ఓటర్ల వివరాలు నమోదు చేసే అవకాశం ఉంటుందని వారు అభిప్రాయపడుతున్నారు. కాకపోతే ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ఒకే విధానాన్ని అమలు చేస్తుండడంతో గడువు పొడిగింపు పై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ఆదేశాలు రావడంలేదని అధికారులు తెలుపుతున్నారు. అతి ముఖ్యమైన విషయానికి వెళితే అధికారులు ఎంత కృషిచేసిన ఓటర్ల సహకారం లేకుండా ఈ ఎస్ ఐ ఆర్ ప్రక్రియ విజయవంతం కావడం సాధ్యం కాదని ఎన్నికల అధికారులు కూడా స్పష్టం చేస్తున్నారు. ఏదిఏమైనా జులై 14 వ తేదీ సాయంత్రం వరకు ఈ ప్రక్రియ నూటికి నూరు శాతం పూర్తి కావాలన్న ఉద్దేశంతో బిఎల్వోలు, సంబంధిత అధికారులు కృషి చేస్తున్నారు. సమయం తక్కువగా ఉండడం ప్రధాన సవాలుగా బిఎల్ఓ లకు, అధికారులకు మారింది. ఒకవేళ కేంద్ర ఎన్నికల సంఘం గడువు పొడిగించకపోతే బి ఎల్ వో లకు ఓటర్లకు అత్యంత కీలకంగా మారనున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు