Homeఅంతర్జాతీయంప్రతీకారం తప్పదు: మొజ్తాబా ఖామేనీ

ప్రతీకారం తప్పదు: మొజ్తాబా ఖామేనీ

- Advertisement -

13 మంది ప్రపంచ నేతలతో హిట్లిస్ట్

తెహ్రాన్: ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ దివంగత అయతుల్లా అలీ ఖామేనీ హత్య తర్వాత అమెరికా, ఇజ్రాయిల్ నేతలపై ఇరాన్ ప్రతీకారంతో రగిలిపో తున్న నేపథ్యంలో ఆయన కుమారుడు, ప్రస్తుత సుప్రీం లీడర్ మొజ్తబా ఖామేనీ తన మొదటి బహిరంగ ప్రసంగం చేస్తూ…13 మంది ప్రపంచ నేతలతో కూడిన ఒక ప్రతీకార జాబితాను ప్రకటించినట్లు ఇరాన్ జాతీయ దినపత్రిక ‘హమ్షాహ్రీ’ శనివారం రాత్రి ఈ జాబితాను ఆన్‌లైన్‌లో ప్రచురిం చింది. ఈ జాబితాలో ప్రధానంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ముఖాలపై స్నైపర్ గన్ గురిపెట్టినట్లు చూపించారు. మిగిలిన 11 మంది నేతలు ఆరెంజ్ కలర్ జైలు దుస్తుల్లో ఉన్నారు. ఆ 11 మందిలో బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ, జర్మనీ ఛాన్స్లర్ ఫ్రీడ్రిచ్ మెర్జ్, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో ర్ఙూయో, అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్, అమెరికా సెంట్రల్ కమాండ్ కమాండర్ బ్రాడ్ కూపర్, ఇజ్రాయెల్‌లో అమెరికా రాయబారి మైక్ హక్కబీ, ఇజ్రాయెల్ రక్షణ దళాల చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఇయాల్ జమీర్, విదేశాంగ మంత్రి గిడియాన్ సార్ ఉన్నారు. ఈ సందర్భంగా మొజ్తబా ఖామేనీ మాట్లాడుతూ… “ప్రతీకారం అనేది మా దేశ సంకల్పం. ఇది కచ్చితంగా జరిగి తీరుతుంది. ఈ జాబితాలో ఉన్న నేరస్థులు తమ పరుపులపై ప్రశాంతంగా ప్రాణాలు వదలాలనే కోరికను మేము నెరవేరనీయం. వారిని ప్రశాంతంగా చావనివ్వం” అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే తన తండ్రి మరణానికి కచ్చితంగా ఎవరు కారణమో మొజ్తాబా నేరుగా పేర్కొనలేదు. మరోవైపు ‘హమ్షాహ్రీ’ పత్రిక ఆన్‌లైన్?లో ప్రచురించిన గ్రాఫిక్ పికÌర్‌ను తెహ్రాన్ ప్రభుత్వం అధికారికంగా ఆమోదించినట్లు ఎలాంటి సంకేతాలు కనిపించలేదు. ఫిబ్రవరి 28న జరిగిన దాడిలో అయతుల్లా అలీ ఖామేనీ మరణించారు. అదే దాడిలో మొజ్తాబా కూడా గాయపడ్డారని వార్తలు వచ్చాయి. ఇటీవల జరిగిన అలీ ఖామేనీ అంత్యక్రియల్లో కూడా పాల్గొనలేదు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు