Homeఅంతర్జాతీయంహోర్మూజ్ మళ్లీ బంద్

హోర్మూజ్ మళ్లీ బంద్

- Advertisement -

అనుమతిలేని మార్గాల్లో వాణిజ్య నౌకలకు ప్రవేశం లేదు: ఇరాన్
తెహ్రాన్:
అమెరికా,ఇరాన్ మధ్య తాత్కాలిక యుద్ధ విరమణ ఒప్పందం విఫలమైంది. దీనితో హోర్మూజ్ జలసంధిలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా జోక్యాన్ని నిరసిస్తూ హోర్మూజ్ జలసంధిని మరుసటి నోటీసు వచ్చే వరకు పూర్తిగా మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. తమ అనుమతి లేని మార్గాల్లో వచ్చే ఏ నౌకనైనా లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించింది. అమెరికా దాడులకు ప్రతీకారంగా…గత కొద్దిరోజుల నుంచి వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. తమ అనుమతి లేకుండా జలసంధిలో ప్రయాణించే వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులకు దిగుతోంది. ఈ నేపథ్యంలోనే సైప్రస్ జెండా ఉన్న వాణిజ్య నౌకపై ఐఆర్‌జీసీ దాడి చేసింది. దీంతో అమెరికా ఆగ్రహానికి గురైంది. అమెరికా సెంట్రల్ కమాండ్ ఇరాన్‌లోని బందర్ అబ్బాస్, సిరిక్, కేష్ˆ ద్వీపాలలో వైమానిక దాడులు చేసింది. హోర్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై జరుగుతున్న దాడులను వెంటనే నిలిపివేయాలని, నౌకలపై దాడులు చేయబోమని హామీ ఇస్తూ 24 గంటల్లో అధికారిక ప్రకటన చేయాలని ఇరాన్‌కు అల్టిమేటం జారీ చేసింది. రెండు దేశాల మధ్య దాడులతో పాటు నేతల మాటల యుద్ధం మరింత ఉద్రిక్తతలకు దారితీస్తుంది. వారి ప్రకటనలబట్టి చూస్తే ఈ మంటలు ఇప్పటిలో చాల్లారేటట్టు కనిపించడం లేదు. నన్ను చంపాలని చూస్తే ఇరాన్ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. హంతకులను వదిలిపెట్టేది లేదని ఇరాన్ సుప్రీం మొజ్తబా శపథం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు