Homeజిల్లాలుకర్నూలు18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి

- Advertisement -

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలని టీటీడీ మండల అధ్యక్షులు గవిగట్టు మల్లికార్జున, సొసైటీ ఛైర్మన్ కందనాతి నరసప్ప అన్నారు. శనివారం మంత్రాలయం నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్ రాఘవేంద్ర రెడ్డి ఆదేశాల మేరకు పెద్దకడబూరు మండల పరిధిలో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని కంబలదిన్నె , జాలవాడి, పెద్దకడబూరు, దొడ్డిమేకల, హెచ్. మురవణి గ్రామాల్లో యూనిట్ ఇంచార్జ్ అంజి, బొగ్గుల నరసన్న , సుధాకర్, సందీప్ లతో కలిసి పరిశీలించారు. తహసీల్దార్ వలిబాషా , ఆర్‌ఐ జెర్మియా లతో కలిసి బీఎల్ఓలకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా, అనర్హులైన వారి పేర్లు తొలగించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందన్నారు. ప్రజలు జూలై 14 తేదీలోపు తమ ఎన్యూమరేషన్ ఫారాలను తప్పనిసరిగా సమర్పించాలని సూచించారు. ఇందుకు మరో మూడు రోజులు మాత్రమే సమయం ఉన్నందున ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.
అందిన ప్రతి ఫారాన్ని డిజిటలైజేషన్ చేయడం జరుగుతుందని, 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువతి, యువకుడు కొత్త ఓటరుగా నమోదు చేసుకోవడం తప్పనిసరి అని తెలిపారు. ఈ ప్రక్రియను వేగవంతం చేయడానికి రెండు రోజులు ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసినట్లు వారు పేర్కొన్నారు.
రాజకీయ పక్షాల ప్రతినిధులు కూడా బీఎల్ఓలకు పూర్తి సహకారం అందించి కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో హెచ్ మురవణి గ్రామ టీడీపీ అధ్యక్షులు సొంటన్న, నాయకులు చెన్నకేశవ, భీమేష్, శంకర్, వీరేష్, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు