Homeజిల్లాలుకర్నూలువిద్యార్థులకు పుస్తకాలు పంపిణీ

విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ

- Advertisement -

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : మండల కేంద్రమైన పెద్దకడబూరులోని స్థానిక ప్రాథమిక పాఠశాల (మెయిన్)లో గురువారం టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి ఆదేశాల మేరకు పాఠశాల విద్యాకమిటీ చైర్మన్ హనుమంతు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు వీరేష్ విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో పాఠశాలలకు మహర్దశ వచ్చిందన్నారు. విద్యార్థులకు నాణ్యమైన, మెనూ ఊభోజనం అందించాలని సూచించారు. అలాగే ఉపాద్యాయులు విద్యార్థులకు గుణాత్మక విద్యను అందించి మంచి పౌరులుగా తీర్చిదిద్దాలని కోరారు. విద్యార్థులు కూడా గురువుల పట్ల, తల్లిదండ్రులను గౌరవిస్తూ శ్రద్ధగా చదివి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగి పాఠశాలకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు.ఈ కార్యక్రమంలో డీలర్ పెద్ద హనుమంతు, నాయకులు కేజీ మల్లికార్జున, లక్ష్మన్న, శ్రీరాములు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు