Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఉచిత సంతాన సాఫల్య వైద్య శిబిరమునకు విశేష స్పందన..

ఉచిత సంతాన సాఫల్య వైద్య శిబిరమునకు విశేష స్పందన..

- Advertisement -

స్పందన హాస్పిటల్ అధినేత లు డాక్టర్ బషీర్, డాక్టర్ సోనియా
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని పుట్టపర్తి రోడ్ సాయిబాబా గుడి పక్కన గల స్పందన హాస్పిటల్ లో నిర్వహించిన ఉచిత సంతాన సాఫల్య శిబిరములకు విశేష స్పందన రావడం జరిగిందని స్పందన హాస్పిటల్ అధినేతలు డాక్టర్ బషీర్, డాక్టర్ సోనియా తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ఉచిత సంతాన సాఫల్య శిబిరంలో డాక్టర్ భవిష్య రెడ్డి వైద్య చికిత్సలను అందించి, సంతానం కావడానికి గల సలహాలు సూచనలను ఇవ్వడం జరిగిందని తెలిపారు. అనంతరం భార్యాభర్తల కలయిక, ఇతరత్రా విషయాలపై వారు అడిగి తెలుసుకున్నారు. సంతానం కాకపోవడానికి ఎన్నో కారణాలు ఉంటాయని, ఆ కారణాలను విశ్లేషించి తగిన వైద్య చికిత్సలను అందించడం జరుగుతుందని వారు తెలిపారు. పిల్లలు కలగడంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? తదితర విషయాలను తెలుపుతూ తగిన సూచనలను ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ శిబిరానికి 62 మంది దంపతులు పాల్గొనడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు