Homeజిల్లాలుశ్రీ సత్యసాయిమిషన్ వాత్సల్య పథకం ద్వారా స్పాన్సర్షిప్ ద్వారా ఆర్థిక సహాయం పొందండి..

మిషన్ వాత్సల్య పథకం ద్వారా స్పాన్సర్షిప్ ద్వారా ఆర్థిక సహాయం పొందండి..

- Advertisement -

ఇన్చార్జి సిడిపిఓ శైలజ
విశాలాంధ్ర ధర్మవరం;; మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో అంతర్భాగమైన మిషన్ వాసల్య పథకమును సద్వినియోగం చేసుకోవాలని ఇన్చార్జ్ సిడిపిఓ శైలజ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ మిషన్ వాత్సల్య పథకం ద్వారా- తల్లిదండ్రులు ఇద్దరులేని పిల్లలకు, పాక్షిక అనాధలు అనగా తల్లి గాని తండ్రి గాని హెచ్ఐవి వ్యాధి ద్వారా మరణించిన పిల్లలకు. తల్లి గాని తండ్రి గాని చనిపోయిన పిల్లలు బుద్ధిమాందత డిజిబిలిటీ ఉన్న పిల్లలు, – తల్లి గాని తండ్రి గాని చనిపోయి ఆర్థికంగా ఇబ్బంది పడుతూ పోషించలేని స్థితిలో ఉన్న పిల్లలు కు కేంద్ర ప్రభుత్వం వీరికి నెలకు Rs. 4000/- రూపాయల ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుంది అని తెలిపారు. కేంద్రం నుంచి బడ్జెట్ వచ్చిన పిదప గౌరవ కలెక్టర్ కమిటీ ఆమోదాన్ని పంపడం తద్వారా వారి ఆమోదం తర్వాత వీరి యొక్క బ్యాంక్ అకౌంట్లకు నేరుగా ఈ ఆర్థిక సహాయాన్ని అందించడం జరుగుతుంది అని తెలిపారు.పైన తెలిపిన పిల్లలకు సంబంధించి ముఖ్యంగా తల్లిదండ్రులు ఇద్దరి లేని వాళ్ళకి మొదటి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది అని తెలిపారు. ఆ విధంగా అప్లికేషన్ ని ఫిల్ అప్ చేసి ఆ పరిధిలోని అంగన్వాడీ టీచర్ ఆ పరిధిలోని మహిళా పోలీస్ ఐసిడిఎస్ సూపర్వైజర్ , సిడిపిఓ సర్టిఫై చేసి , అన్ని సర్టిఫికెట్లను ఎలిజిబులిటీ చూసి ప్రాజెక్ట్ డైరెక్టర్ కార్యాలయానికి పంపుతామని వారు తెలియజేశారు. అర్హులైన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు