Homeజిల్లాలుశ్రీ సత్యసాయిసాయిబాబా దేవాలయమునకు విరాళం.. ప్రీతి బుక్ స్టాల్ రాము

సాయిబాబా దేవాలయమునకు విరాళం.. ప్రీతి బుక్ స్టాల్ రాము

- Advertisement -

విశాలాంద్ర ధర్మవరం:: పట్టణంలోని పుట్టపర్తి రోడ్, సాయి నగర్ లో గల సాయిబాబా ఆలయమునకు పట్టణానికి చెందిన జడ్పీ గర్ల్స్ హై స్కూల్ ఎదురుగా గల ప్రీతి బుక్ స్టాల్-రాము వారి కుటుంబ సభ్యులు ఆలయ కమిటీకి అందజేశారు. ఈ సందర్భంగా దాతలు మాట్లాడుతూ కీర్తిశేషులు చిందలూరు రవీంద్ర, సుబ్బలక్ష్మమ్మ, రామ్ చంద్రన్, ప్రశాంతి, సాయి రాజీవ్, నాగ సాయి శరన్, బాబు ప్రసాద్ జ్ఞాపకార్థం ఆమ్ప్లి ప్లేయర్, రెండు స్పీకర్లు ఇవ్వడం నాకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. నేడు ప్రపంచవ్యాప్తంగా సాయిబాబా మహిమలు అనన్యమైన వని తెలిపారు. అనంతరం శ్రీ షిరిడి సాయిబాబా సేవా సమితి అధ్యక్షులు సూర్యప్రకాష్, ఉపాధ్యక్షులు రాంప్రసాద్, కార్యదర్శి కృష్ణమూర్తి ,ఉప కార్యదర్శి రామాంజనేయులు, కోశాధికారి శ్రీనివాసరావు తదితర సభ్యులు దాతకు ప్రత్యేకంగా కృతజ్ఞతలను తెలియజేశారు. అనంతరం వారి పేరిటన ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించి ఘనంగా సన్మానించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు