విశాలాంధ్ర – ధర్మవరం : పట్టణంలోని పిఆర్టి వీధిలో గత 12 సంవత్సరాలుగా ఎమ్మెస్ ఫిజియోకే క్లినిక్ ను డాక్టర్ ఎమ్మెస్ వినయ్నడుపుతూ ప్రజల వద్ద విశేష సేవలు అందించినందుకు గాను ఒరిస్సా రాష్ట్రంలోని అహమదాబాద్ మూమెంట్ మాస్ ప్రో అకాడమీ వారు వీరి సేవలను గుర్తించి, జులై 8వ తేదీ ఆన్లైన్ ద్వారా అవార్డు పత్రమును వారు అందుకున్నారు. అనంతరం డాక్టర్ ఎంఎస్ వినయ్ మాట్లాడుతూ ఇటువంటి అవార్డు రావడం పట్ల వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రజలకు సేవలు అందించుట అనేది నా బాధ్యత అని వారు తెలిపారు. డైరెక్టర్ కుయులా చేతుల మీదుగా అందుకోవడం జరిగిందని వారు తెలిపారు. అనంతరం కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, శ్రీ శాంత కళ చౌడేశ్వరి దేవి ఆలయ కమిటీ వారు, అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు.
ధర్మవరం డాక్టర్కు బెస్ట్ మాస్టర్ క్లినీషియన్ అవార్డు కైవసం
- Advertisement -
RELATED ARTICLES


