ఆలయ కమిటీ అధ్యక్షురాలు సంకారపు జయ శ్రీ, కార్యదర్శి నరేందర్ రెడ్డి
విశాలాంధ్ర – ధర్మవరం : పట్టణంలోని సిద్దయ్యగుట్టలో నూతనంగా నిర్మాణం అవుతున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ నిర్మాణమునకు ఓ భక్తుడిగా, తన వంతుగా ఆలయ కమిటీ అధ్యక్షురాలు జయశ్రీ అక్క రెండవ అల్లుడు డోండ్ల సుబ్బరాయుడు, వీరి తండ్రి దోండ్ల నాగేంద్రప్రసాద్ జ్ఞాపకార్థం ఆలయ నిర్మాణం గాను లక్ష రూపాయలను విరాళంగా అందజేయడం జరిగిందని ఆలయ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు తెలిపారు. ఈ సందర్భంగా దాతల కుటుంబం పేరిటన ఆలయంలో ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించి వారికి ప్రత్యేక కృతజ్ఞతలను ఆలయ కమిటీ తరఫున తెలిపారు. అనంతరం ఆలయ కమిటీ వారు మాట్లాడుతూ దాతల సహాయ సహకారములతో ఆలయ నిర్మాణం వేగవంతంగా పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఇంకను దాతల సహాయ సహకారాలు ఎంతో అవసరం ఉందని వారు తెలిపారు. 300 సంవత్సరాల కిందట గల ఈ సిద్దయ్య గుట్ట లక్ష్మీనరసింహస్వామి మహిమలు అనన్యమైన అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ డైరెక్టర్లు పాల్గొన్నారు.
శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ నిర్మాణమునకు లక్ష రూపాయలు విరాళం
- Advertisement -
RELATED ARTICLES


