Homeజిల్లాలుశ్రీ సత్యసాయిధర్మవరం వంద సంవత్సరాలు చరిత్ర సమాచార సేకరణ కరపత్రం ఆవిష్కరణ

ధర్మవరం వంద సంవత్సరాలు చరిత్ర సమాచార సేకరణ కరపత్రం ఆవిష్కరణ

- Advertisement -

విశాలాంధ్ర – ధర్మవరం : పట్టణంలోని మెహర్ బాబా సెంటర్ ఆధ్వర్యంలో వృద్ధుల వైద్య శిబిరం నందు
ధర్మవరం సంస్కృతి, చరిత్ర అంశాలకు సంబంధించిన విషయాలలో సేకరించుటకు ఔత్సాహికులకు అందరికీ అవకాశం కల్పించడానికి సరికొత్త రీతిలో ప్రత్యేక కార్యక్రమం ధర్మవరం మెహర్ బాబా సెంటర్ వారు నిర్వహించారు. ఈ సందర్భంగారచయిత జయరామిరెడ్డి, సహరచయిత సత్య నిర్ధారణ రూపొందించిన ప్రత్యేక కరపత్రంమెహర్ బాబా సెంటర్ అధ్యక్షురాలు సుజాతమ్మ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. అనంతరంసుజాతమ్మ మాట్లాడుతూ ఎందరో రచయితలు , పట్టణాల చరిత్ర రాసినప్పటికీ ధర్మవరం చరిత్ర రాయడంలో స్వచ్ఛంద సంస్థలను సంప్రదించడం చాలా ఆనందకరమని, ధర్మవరం పురాతన చరిత్ర గురించి తెలిసిన వారి అభిప్రాయాలు క్రోడీకరించుటకు ప్రత్యేకమైన సమావేశమునకు మా సహకారం అందించమని తెలియజేశారు.
సత్య నిర్ధారణ మాట్లాడుతూ ధర్మవరం సంస్కృతి స్వాతంత్ర, సమరయోధులు, పురాతన కట్టడాలు, స్వచ్ఛంద సంస్థల చరిత్ర సెల్ నెంబర్ 9160970235
పుస్తకం వాట్సప్ గ్రూపు తెలియజేయమని కోరారు.
మెహర్ బాబా కృష్ణమూర్తి రచయిత గురించి మాట్లాడుతూ , నల్లమాడవాసి మా ధర్మవరం చరిత్ర రాయడానికి ముందుకు రావడం , ఇదొక చారిత్రాత్మక పరిణామ మనీ తెలియజేశారు. ప్రతి దశాబ్దంలో జరిగిన మార్పులు గురించి పుస్తకంలో పొందుపరచడం భావితరాలకు ధర్మవరం చరిత్ర తెలియజేయడంచాలా శ్రమతో కూడుకున్న పనిని
తెలిపారు. అనంతరం పాత్రికేయులు, అవార్డుల గ్రహీత నల్లమాడ జయరామిరెడ్డి మాట్లాడుతూ గతంలో ఎన్నో పుస్తకాలు రచించినప్పటికీ
ఈ పుస్తకం రచనకు ప్రముఖుల నుండి, సంస్థల నుండి విషయ సేకరణ సమయంలోనే నన్ను అభినందించడం, సమావేశ ఏర్పాటు చేయడం , రచయితగా నాకు వచ్చిన మంచి అవకాశం అని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో దివ్యాంగుల సంఘం నాగర్జున, లలిత, మెహర్ బాబా ప్రేమికులు, ముఖ్య అతిథి మల్లికార్జున, పుర ప్రముఖులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు