విశాలాంధ్ర – ధర్మవరం;; గాన కోకిల ఎస్ జానకి మృతి పట్ల పట్టణంలోని కళాజ్యోతి కార్యవర్గం కమిటీ వారు తమ సంతాపాన్ని తెలుపుతూ నివాళులర్పించారు. ఈ సందర్భంగా కళాజ్యోతి కమిటీ అధ్యక్షులు కే. నారాయణ, కార్యదర్శి బి. రామకృష్ణ, ఉపాధ్యక్షులు జగ్గా వేణుగోపాల్, సహకార దర్శి పాగాల అశ్వర్థ నారాయణ మాట్లాడుతూ దక్షిణ భారత సినీ సంగీత ప్రపంచాన్ని ప్రముఖ గాయకురాలు జానకి శోకసముద్రంలో ఉండిపోవడం జరిగిందన్నారు. ఆరు దశాబ్దాలుగా పైగా సినీ సంగీతానికి విశిష్ట సేవలను అందించడం జరిగిందన్నారు. 17 భారతీయ భాషల్లో 48 వేలకు పైగా పాటలు ఆలపించిన అరుదైన గాయని జానకి అని తెలిపారు. దక్షిణ భారత కోకిల గాన కోకిలగా విశేష గుర్తింపు పొందడం గర్వించదగ్గ విషయమని తెలిపారు. జానపదం, శాస్త్రీయ సంగీతం, మెలోడీ భక్తి గీతాలు తో సహా అన్ని రకాల పాటల్లో అసాధారణ ప్రతిభ చూపిందని వారు కొనియాడారు. తన మధురమైన గాత్రంతో కోట్లాదిమంది అభిమానులను హృదయాలను గెలుచుకున్నారని తెలిపారు. భారతీయ సినీ సంగీత చరిత్రలో ఆమె సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని తెలిపారు. భారతీయ సినీ సంగీత రంగం ఒక మహోన్నత గాన దిగ్గజాన్ని కోల్పోవడం దురదృష్టకరమని తెలిపారు. అనంతరం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ కళాజ్యోతి కమిటీ వారు ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు రమేష్, రాంప్రసాద్, పెద్దిరెడ్డి ,డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి, మధుసూదన్, సోమశేఖర్, ఎల్ఐసి రామన్న, ఓవి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
గాన కోకిల ఎస్. జానకి మృతి పట్ల సంతాపం తెలిపిన కళాజ్యోతి కార్యవర్గం కమిటీ
- Advertisement -
RELATED ARTICLES


