Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఉపముఖ్యమంత్రి పేరిటన ప్రత్యేక పూజలు

ఉపముఖ్యమంత్రి పేరిటన ప్రత్యేక పూజలు

- Advertisement -

జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి

విశాలాంధ్ర – ధర్మవరం : జనసేన పార్టీ అధ్యక్షుడు ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు జరిగిన శాస్త్ర చికిత్స విజయవంతంగా పూర్తి అయిన సందర్భంగా జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలక మధుసూదన్ రెడ్డి తోపాటు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి పవన్ కళ్యాణ్ పేరిటన ప్రత్యేక పూజలు అర్చనలను నిర్వహించారు. అనంతరం చిలకం మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ శాస్త్ర చికిత్స విజయవంతం కావడం ఆ భగవంతుని ఆశీస్సులు అని, భవిష్యత్తులో సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకోవాలని, మరింత ఉత్సాహంతో తిరిగి ప్రజాక్షేత్రంలోకి రావాలని వారు తెలిపారు. అనంతరం 101 టెంకాయలు కొట్టి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు