Sunday, January 19, 2025
Homeజిల్లాలుఏలూరుఎన్టీఆర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి….

ఎన్టీఆర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి….

ఎమ్మెల్యే బడేటి చంటి….

విశాలాంధ్ర ఏలూరు:నిరంతరం పేదల అభ్యున్నతికి కృషి చేసిన స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య (చంటి) పేర్కొన్నారు.
తేదేపా వ్యవస్థాపకులు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా శనివారం స్థానిక మూడవ డివిజన్ లో టిడిపి ఎస్.సి. సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జాలా బాలాజీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. తొలుత స్వర్గీయ ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.ఈ సందర్భంగా బడేటి చంటి మాట్లాడుతూ సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో పేదవారు అభివృద్ధి చెందాలని కాంక్షతో అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు. రక్తదాన శిబిరాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ అన్ని దానాలలో రక్తదానం ఉత్తమమైనదన్నారు.ఈ చిన్న సహాయం మరొకరి ప్రాణాలు కాపాడుతుందన్నారు.తేదేపా ఎస్.సి.రాష్ట్ర ఉపాధ్యక్షులు, మూడవ డివిజన్ ఇంచార్జ్ జాలా బాలాజీ మాట్లాడుతూ స్వర్గీయ ఎన్టీఆర్ సంక్షేమ పథకాల ఆరాధ్యుడన్నారు.పేదవాడికి పట్టెడన్నం పెట్టాలన్న సంకల్పంతో కిలో 2 రూపాయల బియ్యం పథకాన్ని నిరాటంకంగా అమలు చేశారని కొనియాడారు. స్థానిక శాసనసభ్యులు బడేటి చంటి ఆధ్వర్యంలో నగరం అభివృద్ధి పథంలో పయనిస్తుందని తెలిపారు.జాలా శివశంకర్,వీర బత్తిన రత్తయ్య, షేక్ మస్తాన్ లు రక్తదానం చేశారు.ఈ కార్యక్రమంలో టిడిపి కార్యకర్తలు,పలువురు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు