Homeజిల్లాలుశ్రీ సత్యసాయిదాతలచే భోజనం వరండా ఏర్పాటు..: పాఠశాల హెడ్మాస్టర్ సుమన

దాతలచే భోజనం వరండా ఏర్పాటు..: పాఠశాల హెడ్మాస్టర్ సుమన

- Advertisement -

విశాలాంధ్ర- ధర్మవరం: పట్టణంలోని జెడ్ పి బాలికల పాఠశాల లో 650 పేద బాలికలు 6 వ తరగతి నుండి 10 వ తరగతి వరకు చదువుతున్నారు.మధ్యాహ్నన భోజనం వరండాలో,నేల మీద కూర్చుని ఇదివరకు తినేవారు ఈ విషయం పిల్లల తల్లి తండ్రులు సాహితీ గగన్ మహల్ అధ్యక్షుడు జె.ప్రతాప రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు,ప్రతాప రెడ్డి అభయ ఫౌండేషన్ ఫౌండర్ బాలచంద్ర సుంకు గ దృష్టికి తీసుకొని వెళ్లి అనేక సంవత్సరాలుగా ఉన్న సమస్య ను పరిష్కారం చేయడం జరిగింది అని హెడ్మాస్టర్ సుమనా తెలిపారు .ఈ పాఠశాల హెడ్ మాస్టర్ ప్రత్యేకంగా చొరవ తీసుకొని యదాటి మధుర 2 లక్షలు,యాదాటి మురళీధర్ 50,వేలు అభయ ఫౌండేషన్ ద్వారా రీగల్ రెక్స్నార్డ్ సి ఎస్ ఆర్ నిధులు 3 లక్షల 50 వేలు రూపాయలు తో పెద్ద షెడ్ నిర్మాణం చేయడం జరిగింది అని వారు తెలిపారు.బాలికలకు ఉన్న ప్రదాన సమస్య పరిష్కారం కావడంతో విద్యార్థులు ఆనందం, సంతోషం, సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులచే డైనింగ్ హాల్ ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల బాలచంద్ర,ప్రతాప రెడ్డి, పాఠశాల ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు