అధ్యక్షులు జయసింహ, శెట్టిపీ జయ చంద్రారెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం;; రోటరీ క్లబ్, ఆత్మీయ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ధర్మవరం సంయుక్తంగా రెవెన్యూ డివిజన్ పరిధిలోని చెన్నై కొత్తపల్లి మండలం జడ్పీ ఉన్నత పాఠశాలలో జూలై 19వ తేదీ ఆదివారం ఉదయం ఏడు గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహిస్తున్నట్లు రోటరీ క్లబ్ అధ్యక్షులు జయసింహ, ఆత్మీయ ట్రస్ట్ శెట్టిపి రామిరెడ్డి, శెట్టిపి జయ చంద్రారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఉచిత కంటి శిబిరం యొక్క కరపత్రాలను ధర్మవరం పట్టణంలోని సాంస్కృతిక మండలి లో కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ చెన్నై కొత్తపల్లి మండలం వెంకటం పల్లి గ్రామానికి చెందిన కీర్తిశేషుల జర్రీ పోతుల వెంకటరెడ్డి జ్ఞాపకార్థం ఆయన కుటుంబ సభ్యుల దాతృత్వంతో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ శిబిరం రోటరీ క్లబ్, ఆత్మీయ ట్రస్టు,శంకర కంటి ఆసుపత్రి బెంగళూరు, జిల్లా అంధత్వ నివారణ సంస్థ వారి సహకారంతో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కావున చెన్నై కొత్తపల్లి మండలము చుట్టుపక్కల గల గ్రామ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కంటి ఆరోగ్యమును కాపాడుకోవాలని తెలిపారు. ఈ శిబిరంలో ఉచిత కంటి వైద్య చికిత్సలతో పాటు ఉచిత రవాణా, ఉచిత వసతి, ఉచిత కంటి ఆపరేషన్లు, ఉచితంగా కంటి అద్దాలు కూడా ఇవ్వబడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సోలిగాళ్ళ వెంకటేశు, నరేంద్ర రెడ్డి, ఆత్మీయ ట్రస్ట్ ప్రతినిధులు హీ దయతుల్లా , శ్రీనివాస్ రెడ్డి, రోటరీ క్లబ్ సెక్రటరీ చంద్రశేఖర్, ట్రెజరర్ పెద్దారెడ్డి, యుటిఎఫ్ నాయకులు రామకృష్ణ నాయక్, అమర్ నారాయణరెడ్డి, మేరీ వర కుమారి ,నాగేంద్రమ్మ, జింక హరికృష్ణ, .రామాంజనేయులు, రాంప్రసాద్, బిల్లే రామాంజనేయులు, పూజారి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
రోటరీ క్లబ్ , ఆత్మీయత ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఉచిత కంటి ఆపరేషన్లు
- Advertisement -
RELATED ARTICLES


