వృద్ధుల సామాజిక ఆరోగ్య ప్రణాళిక రూపకర్త డాక్టర్ సత్య నిర్ధారన్
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణములోని జీవోగేరీలో నిర్వహించిన వయోవృద్ధుల మోకాళ్ళ ఉచిత వైద్య శిబిరమునకు విశేష స్పందన రావడం జరిగిందని వృద్ధుల సామాజిక ఆరోగ్య ప్రణాళిక రూపకర్త డాక్టర్ సత్య నిర్ధారన్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ శిబిరానికి ముఖ్య అతిథులుగా రోటరీ క్లబ్ గవర్నర్ నరేందర్ రెడ్డి, ఆదర్శ దంపతులు శశికళ మల్లికార్జున రావడం జరిగిందన్నారు. 16 మంది వృద్ధులకు ఫిజియోథెరపీ, ఐఎఫ్టి పరికరముతో, ఫిజియోథెరపిస్ట్ నజీమా, ఆరోగ్య కార్యకర్త హారిక, వచ్చేంత సేవకుడు ఎల్ఐసి ఏజెంట్ నారాయణస్వామి చేత నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ శిబిరం డాక్టర్ సత్య నిర్ధారన్ భార్య ఉమామహేశ్వరి జ్ఞాపకార్థం నిర్వహించడం జరిగిందని తెలిపారు. కావలసిన సహాయ సహకారాలు గూర్చి హైదరాబాద్ శ్రీకర ఆసుపత్రి ఎముకల వైద్య నిపుణులు డాక్టర్ శ్రీ తేజ ద్వారా సలహాలు సూచనలను ఫోన్ ద్వారా వివరించడం జరిగిందని తెలిపారు. అంతేకాకుండా మహిళా వయోవృద్ధులకు ఫిజియోథెరపీ గూర్చి చక్కటి అవగాహన కూడా కల్పించడం జరిగిందన్నారు. ఫిజియోథెరపీ వలన అపూహలు పెట్టుకోవద్దని తెలిపారు. అంతేకాకుండా మూఢనమ్మకాలను నిర్మించడమే ఫిజియోథెర ఫిస్టు ధ్యేయము అని తెలిపారు. తదుపరి ఫిజియోథెరపిస్ట్ ఉపయోగాలు కూడా వివరించడం జరిగిందని తెలిపారు. శిబిరం కేవలం నిరుపేద ప్రజలకు మాత్రమే అంకితం అని తెలిపారు. ఈ శిబిరంలో 16 మంది వృద్ధులు పాల్గొనడం జరిగిందని తెలిపారు.
వయో వృద్ధుల మోకాళ్ళ ఉచిత వైద్య శిబిరమునకు విశేష స్పందన..
- Advertisement -
RELATED ARTICLES


