Homeజిల్లాలుఅనంతపురంషార్ట్‌సర్క్యూట్‌తో ఇంటిలో అగ్నిప్రమాదం.. సామగ్రి దగ్ధం..

షార్ట్‌సర్క్యూట్‌తో ఇంటిలో అగ్నిప్రమాదం.. సామగ్రి దగ్ధం..

- Advertisement -

విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా) :- మండల పరిధిలోని దుగుమర్రి గ్రామానికి చెందిన పెద్దిరెడ్డి నివాసంలో సోమవారం షార్ట్‌సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఇంట్లో ఉన్న గృహోపకరణాలు, ఫర్నిచర్, ధాన్యం, దుస్తులు తదితర సామగ్రి అగ్నికి ఆహుతైంది.మంటలను గమనించిన స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని మంటలు మరింత వ్యాపించకుండా అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే ఇంట్లోని విలువైన వస్తువులు పూర్తిగా దగ్ధమవడంతో బాధిత కుటుంబానికి భారీ ఆస్తి నష్టం జరిగినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు..

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు