Homeఆంధ్రప్రదేశ్ఇందిరా గాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియాన్ని సందర్శించిన శాప్ చైర్మన్ రవి నాయుడు

ఇందిరా గాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియాన్ని సందర్శించిన శాప్ చైర్మన్ రవి నాయుడు

- Advertisement -
  • నిర్మాణ పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులతో సమీక్ష
  • నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడవద్దని స్పష్టమైన ఆదేశాలు
  • నిర్ణీత గడువులోగా పనులను పూర్తి చేసి అత్యున్నత ప్రమాణాలతో స్టేడియాన్ని క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకురావాలి

విశాలాంధ్ర – విజయవాడ స్పోర్ట్స్ : శాప్ చైర్మన్ రవి నాయుడు , ఖేలో ఇండియా, శాప్ సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న ఇందిరా గాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా స్టేడియంలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించి, సంబంధిత అధికారులు, ఇంజినీర్లు, కాంట్రాక్టర్లతో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, స్టేడియం నిర్మాణంలో నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని స్పష్టం చేశారు. ప్రతి నిర్మాణ పనిని నిర్దేశించిన సాంకేతిక ప్రమాణాలకు అనుగుణంగా, అత్యుత్తమ నాణ్యతతో పూర్తి చేయాలని అధికారులకు, కాంట్రాక్టర్లకు సూచించారు. పనులను వేగవంతం చేసి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయడంతో పాటు, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని స్టేడియాన్ని అత్యున్నత ప్రమాణాలతో అభివృద్ధి చేయాలని ఆదేశించారు. క్రీడాకారులకు ఆధునిక క్రీడా మౌలిక సదుపాయాలు, అత్యుత్తమ శిక్షణా వాతావరణం, అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించేలా ఎటువంటి లోటుపాట్లు లేకుండా పనులు చేపట్టాలని పేర్కొన్నారు. నిర్మాణ ప్రక్రియలో పారదర్శకత, నాణ్యత, భద్రతా ప్రమాణాలను ఖచ్చితంగా పాటిస్తూ, ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా పనులను పూర్తి చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.ఈ స్టేడియం పూర్తయిన అనంతరం రాష్ట్రంలోని క్రీడాకారులకు అత్యుత్తమ శిక్షణా కేంద్రంగా నిలవడంతో పాటు, జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీల నిర్వహణకు అనువైన వేదికగా రూపుదిద్దుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో క్రీడా మౌలిక వసతుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, క్రీడాకారుల ప్రతిభను మరింతగా ప్రోత్సహించే దిశగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో శాప్ ఏవో రమావత్ వెంకటరమణ నాయక్, ఎన్టీఆర్ జిల్లా క్రీడ అభివృద్ధి అధికారి, శాప్ ఇంజనీరింగ్ సిబ్బంది, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు