వైసిపి జిల్లా ఉపాధ్యక్షుడు మాసపల్లి సాయి కు శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి
మాజీ ఎమ్మెల్యే కలిసేందుకు భారీగా తరలి వచ్చిన వైసీపీ శ్రేణులు
విశాలాంధ్ర ధర్మవరం; పట్టణం ఎస్బిఐ కాలనీలో గల మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి కార్యాలయంలో నందు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ను వైసిపి నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. శ్రీ సత్యసాయి జిల్లా వైఎస్ఆర్సిపి పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు మాసపల్లి సాయికుమార్ కేతిరెడ్డి వెంకటరామిరెడ్డికి పుష్పగుచ్చం అందజేసి దుశ్యాలతో సత్కరించారు. మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సిపి పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు మాసపల్లి సాయికుమార్ నియమించడం సంతోషకరంగా ఉందన్నారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి మాసపల్లి సాయి కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వైసీపీ శ్రేణులను వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సిపి పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు మాసపల్లి సాయికుమార్ మాట్లాడుతూ.. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి నాపై నమ్మకంతో వైసిపి జిల్లా ఉపాధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే ఎలక్షన్లో వైసిపి పార్టీ గెలుపు కోసం, వైసిపి పార్టీ బలోపేతం చేయడానికి కృషి చేస్తానన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ జిల్లా ఉపాధ్యక్షునిగా ఎన్నుకున్న తర్వాత నాకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ గజ్జల శివ, కత్తే పెద్దన్న, వైఎస్ఆర్సిపి నాయకులు చిన్నూరు తిమ్మన్న, చిన్నూర్ రమేష్, దాసరి శ్రీనివాసులు, పెద్దిరెడ్డి గారి శ్రీనివాసులు, సాగ శ్రీనివాసులు, యంబ తిరుపాలు, బుగ్గ నాగభూషణం, ఆకుల రామలింగా, ఆకుల రవి, చందు, కలిగిపుల శివ, జ్యోతి మల్లికార్జున, ఓం ప్రకాష్, కుమార్, హరీష్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.