విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని ఎన్జీవో హోం లో ధర్మవరం మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ కమిటీ ఏర్పాటును ముఖ్యఅతిథిగా విచ్చేసిన రాష్ట్ర ఉపాధ్యక్షులు నవీన్ కుమార్ ఆధ్వర్యంలో కమిటీని ఎంపిక చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు కమిటీని ప్రకటించడం జరిగింది. ఇందులో అసోసియేషన్ అధ్యక్షుడిగా అంజన్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా సయ్యద్, కోశాధికారిగా రవి, కార్యదర్శిగా మనోహర్ తో పాటు సభ్యులను ఎన్నుకోవడం జరిగిందని తెలిపారు. అనంతరం రాష్ట్ర ఉపాధ్యక్షులు నవీన్ కుమార్ నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలియజేశారు. ఎన్నికైన కమిటీ వారు మాట్లాడుతూ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని, అసోసియేషన్ అభివృద్ధికి పాటుపడతామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మెడికల్ అండ్ ల్యాబ్ టెక్నీషియన్ వారు పాల్గొన్నారు.
నూతన మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అసోసియేషన్ కమిటీ ఏర్పాటు
RELATED ARTICLES