విశాలాంధ్ర ధర్మవరం;; ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ లేదా సీటు బెల్టుతో వాహనాలను నడపాలని రూరల్ ఎస్సై శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్భంగా మండల పరిధిలోని గొట్లూరు గ్రామ ప్రజలకు అవగాహన ర్యాలీని వారు నిర్వహించారు. ఈ సందర్భంగా గొట్లుర్ జడ్పీ హైస్కూల్ విద్యార్థులచే పట్టణములో ర్యాలీ నిర్వహిస్తూ మానవాహారాన్ని నిర్వహించడం జరిగింది. అనంతరం రూరల్ ఎస్సై శ్రీనివాసులు మాట్లాడుతూ ట్రాఫిక్ నియమ నిబంధనలు, డ్రైవింగ్ పై పూర్తి అవగాహన లేకపోవడంతోనే ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని తెలిపారు. డ్రైవింగ్ చేసేటప్పుడు మద్యం సేవించి నడపరాదని, సెల్ఫోన్తో డ్రైవింగ్ చేయరాదని తెలిపారు. అలా చేసినచో ప్రమాదాలు జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయని తెలిపారు. అదేవిధంగా తల్లిదండ్రులు తమ పిల్లలను (మైనారిటీ) కు టూవీలర్లు ఇచ్చి వాహనాలు నడిపించినచో తల్లిదండ్రులతో పాటు జరిమానా తో పాటు కేసులు కూడా నమోదు చేస్తామని తెలిపారు. కావున ప్రతి వాహనదారుడు నియమ నిబంధనలు పాటించి ప్రమాద రహిత ప్రయాణం చేయాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో రూరల్ పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
హెల్మెట్, సీటు బెల్టుతోనే వాహనాలను నడపాలి.. రూరల్ ఎస్సై శ్రీనివాసులు
RELATED ARTICLES