ఏపీ చేనేత కార్మిక సంఘం డిమాండ్
విశాలాంధ్ర -ధర్మవరం;నేతన్న సేవ సర్వే గడువును పొడిగించాలని ఏపీ చేనేత కార్మిక సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఏపీ చేనేత కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ జె.వి.రమణ జిల్లా నాయకులు ఎస్ హెచ్ భాషా , ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు జంగాలపల్లి పెద్దన్న మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నేతన్న సేవ పేరుతో చేనేత కార్మికులకు 25 వేల రూపాయలు మంజూరు చేసే సందర్భంలో చేనేత కార్మికుల నిజమైన లబ్ధి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కేవలం జులై 31వ తేదీ మాత్రం సర్వే చేసి లబ్ధిదారుల ను ఎంపిక చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అధికారులకు ఆదేశించడం చాలా బాధాకరమని వారు తెలిపారు. ఒక రోజు సర్వే పేరుతో అనేకమంది చేనేత కార్మికులకు అన్యాయం చేయడం తప్ప మరొకటి కాదని వండిపడ్డారు. అదేవిధంగా 200 యూనిట్లు ఉచిత విద్యుత్తు అనేకమంది చేనేత కార్మికులకు వర్తించలేదని అటువంటి కార్మికులందరికీ అన్యాయం చేయడానికి ప్రభుత్వం నిర్వహించే సర్వే వలన అనేక మంది కార్మికులు నష్టపోయే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. కావున సర్వేకి మరికొంత సమయాన్ని కేటాయించి అర్హులైన ప్రతి చేనేత కార్మికునికి నేతన్న సేవ పథకం ద్వారా 25వేల రూపాయలు వర్తించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. అదేవిధంగా చేనేత పైన ఆధారపడిన చేనేత వృత్తుల వారికి కూడా 200 యూనిట్లు ఉచిత విద్యుత్తు నేతన్న సేవ పథకం వర్తించే విధంగా చర్యలు చేపట్టాలని తెలిపారు. ఆ విధంగా కాకుండా చేనేత కార్మికులకు నష్టం కలిగించే విధంగా ప్రభుత్వ చర్యలు ఉంటే ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో నష్టపోయిన చేనేత కార్మికులందరిని కలుపుకొని జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో చేనేత సంఘం పట్టణ అధ్యక్షులు ఏ ఖాదర్బాషా, కార్యదర్శి గుంపు హరి, చేనేత నాయకులు వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.
నేతన్న సేవ సర్వే గడువును పొడిగించాలి…
- Advertisement -
RELATED ARTICLES


