Homeజాతీయంఇదిగో.. నా స్కాలర్‌షిప్ లెటర్.. చదువుకోండి: అభిజీత్ దీప్కే

ఇదిగో.. నా స్కాలర్‌షిప్ లెటర్.. చదువుకోండి: అభిజీత్ దీప్కే

- Advertisement -

తన అమెరికా చదువుపై వివరణ ఇచ్చిన అభిజిత్ దీప్కే
స్కాలర్‌షిప్, ఎడ్యుకేషన్ లోన్‌తోనే చదివానని వెల్లడి
దీప్కే కుటుంబ ఆర్థిక స్థితిపై విచారణ కోరిన ఆర్టీఐ కార్యకర్త

కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే కుటుంబ ఆర్థిక స్థితిపై విచారణ జరపాలని ఆర్టీఐ కార్యకర్త ఫిర్యాదు చేసిన ఒక్క రోజులోనే అభిజిత్ ఈ విషయంపై స్పందించారు. అమెరికాలోని బోస్టన్ యూనివర్సిటీలో తన ఉన్నత చదువుకు స్కాలర్‌షిప్, ఎడ్యుకేషన్ లోన్ మాత్రమే ఆధారం అని ఆయన స్పష్టం చేశారు. సీనియర్ జర్నలిస్ట్ బర్ఖా దత్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తన విదేశీ చదువు వెనుక కుటుంబానికి లెక్కల్లో చూపని ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. నా చదువుకు బోస్టన్ యూనివర్సిటీ ఇచ్చిన స్కాలర్‌షిప్ సాయపడింది. కొంత ఎడ్యుకేషన్ లోన్ కూడా తీసుకున్నా. దాన్ని ఇప్పుడు తిరిగి చెల్లించాల్సి ఉంది అని చెబుతూ తన స్కాలర్‌షిప్ లెటర్‌ను చూపించారు.సూరత్‌కు చెందిన ఆర్టీఐ కార్యకర్త అమిత్ తివారీ, ఆగస్టు 1న మహారాష్ట్ర ప్రభుత్వం సహా పలువురు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీప్కే తండ్రి, మహారాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎంఐడీసీ)లో రిటైర్డ్ జూనియర్ ఇంజనీర్‌గా నెలకు రూ. 60,000-65,000 జీతంతో తన పిల్లలను అమెరికాకు ఎలా పంపగలరని ప్రశ్నించారు.

భవిష్యత్తులో పార్టీ కార్యకలాపాలకు నిధుల గురించి కూడా దీప్కే మాట్లాడారు. సీజేపీ ముందు ముందు క్రౌడ్ ఫండింగ్ చేస్తుంది. ప్రజల నుంచి డబ్బు అడుగుతాం, ఈ విషయంలో చాలా పారదర్శకంగా ఉంటాంఁ అని తెలిపారు. నీట్ పేపర్ లీక్ వ్యతిరేక ఆందోళనల సమయంలో కొందరు ఢిల్లీ పోలీసులు కూడా తమకు రహస్యంగా మద్దతు తెలిపి వాటర్ బాటిళ్లు అందించారని తెలిపారు.

నీట్ వ్యతిరేక ఆందోళనల్లో అరెస్టయిన వారికి మద్దతుగా కపిల్ సిబల్ రూ. కోటి న్యాయ సహాయ నిధిని ప్రకటించిన తర్వాత సీజేపీ నిధులపై పరిశీలన పెరిగింది. మరోవైపు, సీజేపీ అధికార ప్రతినిధి వైష్ణవి గౌర్ ఈ ఆరోపణలపై స్పందిస్తూ ఒక ప్రైవేట్ వ్యక్తి చదువు ఖర్చులపై ఆర్టీఐలు వేసే వారు పీఎం కేర్స్ ఫండ్ గురించి కూడా చూడాలిఁ అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు