Homeజిల్లాలుఅనంతపురంపశువులకు గడ్డి కేంద్రాలు ఏర్పాటు చేయాలి

పశువులకు గడ్డి కేంద్రాలు ఏర్పాటు చేయాలి

- Advertisement -

తాసిల్దార్ కు వినతిపత్రం అందిస్తున్న దృశ్యం

విశాలాంధ్ర – విశాలాంధ్ర : ప్రస్తుతం నెలకొన్న వర్షాభావ పరిస్థితుల కారణంగా పశువులకు గడ్డి కొరత ఏర్పడిందని, దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు మొలక బాల రామాంజనేయులు అన్నారు. పశువులను కాపాడేందుకు ప్రభుత్వం తక్షణమే అన్ని మండలాల్లో గడ్డి కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సోమవారం వజ్రకరూరు మండల కేంద్రంలో వివిధ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులతో కలిసి తహసీల్దార్‌ జయశ్రీ కు వినతిపత్రం అందజేశారు. పశువులకు గడ్డి దొరక్క రైతులు పడుతున్న ఇబ్బందులను అధికారులు, ప్రభుత్వం గుర్తించి వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు. గడ్డి కొరతతో పశువుల పెంపకంపై ఆధారపడిన రైతులు ఆర్థికంగా నష్టపోయే పరిస్థితి ఉందని, ప్రభుత్వం అత్యవసరంగా గడ్డి సరఫరా చేపట్టి పశువులను కాపాడాలని విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు