క్యాంపు చైర్మన్ దాసరి వెంకటేశులు (చిట్టి)
విశాలాంధ్ర – ధర్మవరం : పేద ప్రజలకు వైద్య సేవలు అందించడమే మా లక్ష్యము అని క్యాంపు చైర్మన్, కోశాధికారి దాసరి వెంకటేశులు (చిట్టి) తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని తొగట వీధిలో ఆదివారం శ్రీ శాంత కళాచౌడేశ్వరి దేవాలయ ఆవరణములో 126వ ఉచిత వైద్య చికిత్స శిబిరమును నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా దాతల సహాయ సహకారములతో వందలాది పేద ప్రజలకు ఉచిత వైద్యం తో పాటు ఒక నెలకు సరిపడు మందులను ఉచితంగా పంపిణీ చేస్తున్నామని తెలిపారు. నేటి ఈ కార్యక్రమానికి దాతగా కీర్తిశేషులు బంధనాథం నారాయణస్వామి జ్ఞాపకార్థం ధర్మపత్ని లక్ష్మీదేవమ్మ, వీరి కుమారులు బంధనాథం వెంకటరమణ అండ్ బ్రదర్స్ వారు వ్యవహరించడం పట్ల ఆలయ కమిటీ తరపున ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేయడం జరిగిందని తెలిపారు. ఈ శిబిరంలో 220 మందికి వైద్య చికిత్సలతో పాటు నెలకు సరిపడు మందులను కూడా ఉచితంగా పంపిణీ చేసినట్లు వారు తెలిపారు. ఈ శిబిరంలో నిష్ణాతులైన డాక్టర్ వివేక్ కుళ్లాయప్ప-దంత వైద్యులు, డాక్టర్ విట్టల్-దంత వైద్యులు, డాక్టర్ జైదీపు నేత- గ్యాస్ట్రో అండ్ లాప్రోస్క్ సర్జన్, డాక్టర్ సతీష్ కుమార్- ఆర్థో, డాక్టర్ పావని-దంత వైద్యులు, డాక్టర్ వినయ్ పాల్గొని, వైద్య చికిత్సలను అందించి, ఆరోగ్యం పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ శాంత కళా చౌడేశ్వరి దేవి ఆలయ అభివృద్ధి సంఘం అధ్యక్షులు బి. వెంకటరమణ, కార్యదర్శి రాధాకృష్ణ తో పాటు బండి నాగరాజు, సోమశేఖర్ ,కాచర్ల నారాయణస్వామి, పెద్దకోట్ల విజయ్, పెద్ద కోట్ల భాస్కర్, చందా జయచంద్ర, బంధనాథం చిన్నికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
పేద ప్రజలకు వైద్య సేవలు అందించడమే మా లక్ష్యము
- Advertisement -


