Homeజిల్లాలుఅనంతపురంవాహనాలకు అన్ని విధాల రికార్డులు ఉండాలి

వాహనాలకు అన్ని విధాల రికార్డులు ఉండాలి

- Advertisement -

రూరల్ ఎస్సై రాజశేఖర్


విశాలాంధ్ర – ధర్మవరం : ప్రతి ఫోర్ వీలర్, టూవీలర్ వాహనాలకు అన్ని విధాల రికార్డులు, లైసెన్సులు, ఇన్సూరెన్స్ తప్పక ఉండాలని రూరల్ ఎస్సై రాజశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా వారు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పలు వాహనాలను తనిఖీ చేశారు. అనంతరం కొన్ని వాహనాలను గుర్తించి నిబంధనల ప్రకారం ఎటువంటి ఆధారాలు లేని వాటిని పరిశీలించి జరిమానాలు విధించారు. అనంతరం వారు మాట్లాడుతూ వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నియమ నిబంధనలను పాటించాలని, అవసరమైన ధ్రువపత్రాలు వెంట ఉంచుకోవాలని తెలిపారు. రోడ్డు భద్రత దృష్ట్యా వాహన తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని వారు స్పష్టం చేశారు. మద్యం తాగి సేవించరాదని, అలా సేవిస్తే పదివేల రూపాయలు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జరిమానా ఉంటుందని తెలిపారు. అంతేకాకుండా మైనర్ బాల బాలికలకు వాహనాలు ఇవ్వరాదని, అలా ఇస్తే జరగబోయే ప్రమాదాలకు తల్లిదండ్రులే బాధ్యులు అవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రూరల్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు