Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఎల్‌నినో ప్రభావంపై రైతులు అప్రమత్తంగా ఉండాలి ..ఎమ్మెల్యే కందికుంట

ఎల్‌నినో ప్రభావంపై రైతులు అప్రమత్తంగా ఉండాలి ..ఎమ్మెల్యే కందికుంట

- Advertisement -

విశాలాంధ్ర, కదిరి: ఎల్‌నినో విపత్తును ఎదుర్కొనేందుకు రైతులు అప్రమత్తంగా ఉండాలని కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ సూచించారు. పట్టణంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అవసరమైన గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా తాగునీరు అందించాలని, ఎల్‌నినో ప్రభావంతో తలెత్తే నీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకుని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.అనంతరం టిడ్కో అధికారులతో సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే గృహ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. గతంలో డీడీలు చెల్లించిన నిజమైన పేద లబ్ధిదారులకు ఇళ్లు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. గతంలో జరిగిన అవకతవకలను క్షుణ్ణంగా పరిశీలించి, అర్హులైన లబ్ధిదారులకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు