Homeజిల్లాలుకోనసీమరోడ్ల దుస్థితికి మోక్షం: మంత్రి సుభాష్ చొరవతో వేగంగా సాగుతున్న పనులు!

రోడ్ల దుస్థితికి మోక్షం: మంత్రి సుభాష్ చొరవతో వేగంగా సాగుతున్న పనులు!

- Advertisement -

రూ.37.65 కోట్ల రోడ్డు నిర్మాణ పనులు వేగవంతం

విశాలాంధ్ర – రామచంద్రపురం నియోజకవర్గం : రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ చొరవతో గొల్లపాలెం – కుయ్యేరు రోడ్డుకు ఎట్టకేలకు మోక్షం లభించింది. దశాబ్దానికి పైగా నిధుల కొరతతో నిర్మాణానికి నోచుకోకుండా ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన గొల్లపాలెం–కుయ్యేరు రహదారికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముగింపు పలికింది. రూ.37.65 కోట్ల భారీ వ్యయంతో చేపట్టిన సుమారు 13 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.
కాజులూరు మండలంలో జరుగుతున్న ఈ రోడ్డు నిర్మాణ పనులను మంత్రి వాసంశెట్టి సుభాష్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రోడ్డు నిర్మాణంలో ఉపయోగిస్తున్న నాణ్యతా ప్రమాణాలను పరిశీలించి, పనులు నాణ్యతతో పాటు నిర్ణీత గడువులోగా పూర్తయ్యేలా ఆర్‌అండ్‌బీ అధికారులకు తగిన సూచనలు చేశారు. ఇప్పటికే రూ.19.25 కోట్ల మేర పనులు పూర్తయ్యాయని, మిగిలిన పనులను కూడా వేగంగా పూర్తి చేస్తామని తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ,గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా రహదారులు గుంతలమయంగా మారి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని విమర్శించారు. అభివృద్ధి పనులు చేపట్టకుండా కాలయాపన చేసిన గత పాలకులు ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక విషప్రచారానికి దిగుతున్నారని మండిపడ్డారు.
గొల్లపాలెం–కుయ్యేరు రోడ్డు విషయంలో వైసీపీ నాయకులు ఎన్ని విమర్శలు చేసినా, కూటమి ప్రభుత్వం ప్రజల అవసరాన్ని గుర్తించి నిధులు మంజూరు చేసి పనులను ప్రారంభించిందన్నారు. వివిధ దేశాల్లో నెలకొన్న యుద్ధ పరిస్థితుల కారణంగా తారు, ఇతర ముడి సరుకుల లభ్యతలో ఏర్పడిన ఇబ్బందుల వల్ల పనుల్లో కొంత ఆలస్యం జరిగిందని, ప్రస్తుతం పనులు వేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం.
ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ సూపర్ సిక్స్‌ను సూపర్ హిట్ చేసామన్నారు.
ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ అక్కల రిశ్వంత్ రాయ్, ఎంపీడీవో జె రాంబాబు, ఆర్ అండ్ బి జె ఈ ప్రసన్న, కాజులూరు మండల టీడీపీ అధ్యక్షులు చవ్వాకుల నారాయణమూర్తి, అన్యం శ్రీరామచంద్రమూర్తి, జనసేన అధ్యక్షులు బొండా వెంకన్న, చుండ్రు వీర్రాజు చౌదరి అంగర కృష్ణ, సొసైటీ అధ్యక్షులు కోట తాతబ్బాయి,వనుం వీరబ్రహ్మం,
రెడ్డి శేషారావు, దడాల నాగార్జున, మేడిశెట్టి వీర వెంకట సత్యనారాయణ, ధరణి, చందాల మల్లిబాబు, తాడి రామారెడ్డి, తోట కృష్ణ, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు,కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు, ఆర్‌అండ్‌బీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు