ఉపాధ్యాయ సంఘాల డిమాండ్
విశాలాంధ్ర – రామచంద్రపురం : ప్రభుత్వ ఉపాధ్యాయులకు గుదిబండగా మారిన టెట్ (TET) పరీక్షను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ద్రాక్షారామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు భోజన విరామ సమయంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. రాష్ట్రవ్యాప్త వివిధ ఉపాధ్యాయ సంఘాల పిలుపులో భాగంగా పాఠశాల ఆవరణలోని సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహానికి ఉపాధ్యాయులు వినతిపత్రం సమర్పించారు.తమిళనాడు ప్రభుత్వం తరహాలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కోరి ‘టెట్’ పరీక్షను తక్షణమే రద్దు చేయాలని వారు కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో UTF, STU, APUS, PRTU సంఘాలకు చెందిన ఉపాధ్యాయులు, నాయకులు పాల్గొన్నారు.


