Homeఆంధ్రప్రదేశ్ముగిసిన డబ్ల్యూఏపీఎల్ ఆక్షన్

ముగిసిన డబ్ల్యూఏపీఎల్ ఆక్షన్

- Advertisement -
  • ప్లేయర్లను కొనుగోలు చేసేందుకు పోటీ పడిన ఫ్రాంచైజీలు
  • యువ ప్లేయర్లపై ఆసక్తి చూపిన టీమ్స్
  • ఆక్షన్ లో టాప్ లేపిన పెరీరా ఫ్లావియా హేన్రిట్ట
  • 4.3 లక్షలతో హేన్రిట్టా ను సొంతం చేసుకున్న గోదావరి గోల్డెన్ ఈగల్స్
  • టీమిండియా స్టార్ ప్లేయర్ శ్రీ చరణి ని సొంతం చేసుకున్న రాయలసీమ జెన్ స్టార్స్
  • 12 సంవత్సరాల వయసులోనే ఆక్షన్ లో అడుగుపెట్టిన ఏ సాయి షణ్ముఖ ప్రియ
  • షణ్ముఖ ప్రియా ను సొంతం చేసుకున్న రాయలసీమ
  • ఆక్షన్ లో ప్రత్యేక ఆకర్షణగా భారత మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్
  • ఆంధ్ర మహిళల క్రికెట్ చరిత్రలో ఇది మరిచిపోలేని రోజు అన్న గవర్ణింగ్ కౌన్సిల్ చైర్మన్ సుజయ్ కృష్ణ రంగారావు, క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ

విశాలాంధ్ర – స్పోర్ట్స్ కరెస్పాండంట్ : విజయవాడ(నోవోటల్) విజయవాడ నో హోటల్ వేదికగా డబ్ల్యూ ఏ పి ఎల్ 2026 ఫ్రాంచైజీ మోడల్ లో ఏదైతే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని యోజన చేసిందో ఈరోజు ఆ కార్యక్రమం విజయవంతమైంది మహిళ సాధికారత కోసం ఏసీఏ వేస్తున్న అడుగులకు ఆయా ఫ్రాంచైజీలు ఆసక్తిని అద్భుతంగా కనపరిచాయి. స్టార్ ప్లేయర్లతోపాటు యువ ప్లేయర్లపై కూడా ఫ్రాంచైజీలు అదే ఆసక్తిని ఘనపరిచాయి ఇందులో ప్రధానంగా డబ్ల్యూ ఏపీ ఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన క్రీడాకారిణిగా హేన్రిట్టా రికార్డు సృష్టించింది ఆమెను గోదావరి గోల్డెన్ ఈగల్స్ జట్టు 4. 3 లక్షలకు సొంతం చేసుకుంది అటు 12 సంవత్సరాల అతి చిన్న వయసులోనే ఆక్షన్ లోకి వచ్చిన ఏ సాయి షణ్ముఖ ప్రియా ను రాయలసీమ జట్టు సొంతం చేసుకుంది మరోవైపు భారత స్టార్ ప్లేయర్ శ్రీ చరణీని 1.1 లక్షకు రాయలసీమ జట్టు సొంతం చేసుకుంది మరొక భారత జట్టు తరఫున అద్భుత ప్రదర్శన కనపరిచిన కే అంజలి శర్వాణిని వైజాగ్ ఫైర్ బర్డ్స్ జట్టు కొనుగోలు చేసింది మరోవైపు నీరగట్టు అనూషను అమరావతి ఈ ఛాంపియన్స్ జట్టు 2.1 లక్ష వెచ్చించి సొంతం చేసుకుంది. మొత్తం 191 మంది ప్లేయర్స్ డబ్ల్యూ ఏపిఎల్ కు నమోదు చేసుకోగా అందులో 74 మంది ప్లేయర్లను ఆయా ఫ్రాంచైజీలు కొనుగోలు చేశాయి. అన్ని టీంలు దాదాపుగా తమ పర్సును ఖాళీ చేశాయని చెప్పుకోవచ్చు ఇది ఇలా ఉండగా భారత మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ ఈ ఆక్షన్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు ఈ ఆక్షన్ అనంతరం ఐపీఎల్ గవర్ణింగ్ కౌన్సిల్ చైర్మన్ సుజయ్ కృష్ణ రంగారావు, ఏ సి ఏ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ ఆపరేషన్స్ కళ్యాణ్ కృష్ణ మీడియాతో మాట్లాడుతూ ఈరోజు ఆంధ్ర మహిళలక్రికెట్ చరిత్రలో గుర్తుండిపోయే రోజని గతంలో టోర్నమెంట్ లాగా నిర్వహించే డబ్ల్యుఏపీఎల్ మొదటిసారి ఫ్రాంచైజీ విధానంలో చేసినందుకు గర్వపడుతున్నాం అని అన్నారు.ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాద్ చిన్ని కార్యదర్శి సానా సతీష్ మాకు ఎంతగానో సహకరిస్తున్నారు అని తెలిపారు.ఫ్రాంచేసి విధానంలో చేస్తున్నాం అనగానే 11 టీంలు వస్తే నాలుగు టీం లను సెలెక్ట్ చేయడం జరిగిందని నాలుగు టీంలు అత్యద్భుతంగా ఈరోజు ఆక్షన్ లో ప్రదర్శన చేసి ప్లేయర్స్ ను కొనుగోలు చేసినట్లు తెలిపారు.ఉమెన్స్ క్రికెట్లో మరో స్థాయికి తీసుకెళ్లాలని తపన కోరిక ఉన్నట్లు తెలిపారు.మిథాలీ రాజ్ లాంటి ఒక గొప్ప క్రికెటర్ ఏమీ ఆశించకుండా ఉమెన్ క్రికెట్ డెవలప్మెంట్ కోసం బ్రాండ్ అంబాసిడర్ గా ఆంధ్ర క్రికెట్కు ఉంటానని చెప్పడం గొప్ప విషయం అని శ్రీ చరణి ఏ విధంగా ఈరోజు దేశం తరపున అద్భుత ప్రదర్శన ఘనపరుస్తుందో అనేకమంది శ్రీచరణలు ఈ డబ్ల్యూ ఏ పి ఎల్ నుండి రాబోతున్నారు అని స్పష్టం చేశారు.ఒక మారుమూల ప్రాంతం నుండి వచ్చిన ఆణిముత్యం నేడు భారత జట్టులో ప్రధాన భూమిక పోషిస్తుంది అంటే అది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ చూపించిన చొరవ అని సెప్టెంబర్ 15 తర్వాత టోర్నమెంట్ ప్రారంభించాలని ఆలోచిస్తున్నాం అని అన్నారు.మ్యాచ్లన్నీ మంగళగిరి వేదికగా డే మ్యాచులు మరియు నైట్ మ్యాచులు కూడా జరగబోతున్నాయి అని తెలిపారు. షెడ్యూల్ త్వరలోనే విడుదల చేయబోతున్నామని మ్యాచులు చూసేందుకు ప్రజలంతా వస్తారని ఆశిస్తున్నట్లు తెలియచేసారు. ఆక్షన్ ను శ్వేతా బాల్ చాలా అద్భుతంగా నిర్వహించారని తెలిపారు ఈ కార్యక్రమంలో గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ సుజయ్ కృష్ణ రంగారావు, డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ ఆపరేషన్స్ కళ్యాణ్ కృష్ణ, భారత మాజీ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్, అపెక్స్ కమిటీ సభ్యులు, పలు ఫ్రాంచైజీల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు