Homeజిల్లాలుఅనంతపురంమిలాద్ ఉన్ నబీ సందర్భంగా వృద్ధులకు ఆప్యాయతతో అన్నదానం

మిలాద్ ఉన్ నబీ సందర్భంగా వృద్ధులకు ఆప్యాయతతో అన్నదానం

- Advertisement -

అన్నదానం నిర్వహిస్తున్న దృశ్యం

విశాలాంధ్ర, ఉరవకొండ: మిలాద్ ఉన్ నబీ పండుగను పురస్కరించుకొని మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు బాల రామాంజనేయులు ఆధ్వర్యంలో మంగళవారం ఉరవకొండలోని విట్టల్ వృద్ధ అనాథ ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పండుగ ఆనందాన్ని వృద్ధులతో పంచుకోవాలనే ఉద్దేశంతో ఆశ్రమానికి వెళ్లిన వారు వారితో కొద్దిసేపు ఆప్యాయంగా ముచ్చటించారు. అనంతరం వృద్ధులకు అన్నదానం చేసి, వారి ఆశీస్సులు పొందారు. పండుగ రోజున తమను గుర్తు చేసుకుని అన్నదానం చేయడం పట్ల ఆశ్రమంలోని వృద్ధులు సంతోషం వ్యక్తం చేశారు. మానవత్వమే మతాలకతీతంగా అందరినీ కలిపే బంధమని ఈ సందర్భంగా నిర్వాహకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు