అడ్మిషన్ పత్రం అందజేసిన అనంత వైద్య కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య డాక్టర్ ఎం విజయశ్రీ
విశాలాంధ్ర – అనంతపురం టౌన్ : 2026 వ బ్యాచ్ వైద్య విద్యార్థులకు నీట్ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్లో అనంతపురం నగరం అమ్మాయి అనన్య శౌరి ఆల్ ఇండియా 32073 ర్యాంక్ ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ ర్యాంక్ 816 సాధించి అనంత మెడికల్ కళాశాల ను ఎంచుకొని మంగళవారం సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ తర్వాత అనంత మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎo విజయశ్రీ చేతుల మీదుగా అడ్మిషన్ పత్రం పొందింది. అనన్య శౌరి తల్లిదండ్రులు అనంతపురం ప్రభుత్వ వైద్య కళాశాలలో గల ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో తండ్రి ఆచార్య డాక్టర్ శ్రీనివాస్ శౌరి హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ ప్రధాన విభాగాధిపతిగా, తల్లి ఆచార్య డాక్టర్ సుచిత్ర గైనకాలజీ విభాగంలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. అనన్య శౌరి అన్నయ్య కూడా ఇదే అనంతపురం ప్రభుత్వ వైద్య కళాశాలలో ద్వితీయ సంవత్సరం ఎంబిబిఎస్ (2024 వ బ్యాచ్) చదువుతున్నాడు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు డాక్టర్ శౌరీ, డాక్టర్ సుచిత్ర మాట్లాడుతూ… ఇదే కళాశాలలో ప్రొఫెసర్లుగా మేము పని చేస్తూ మా పిల్లలు ఇద్దరిని కూడా ఇక్కడే జాయిన్ చేయడానికి ప్రధానమైన కారణం ఇక్కడే అధ్యాపక సిబ్బంది, బోధన ప్రమాణాల తీరు ప్రధాన కారణమని, దేశంలోని ప్రధాన కళాశాలలకు ఏమాత్రం తక్కువ లేకుండా ఇక్కడ వైద్య విద్యా ప్రమాణాలు ఉన్నాయని,ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తి గత పర్యవేక్షణ ఉంది అని అందుకే ఇక్కడే ప్రవేశం పొందామని తెలిపారు. ఈ సందర్భంగా వైద్య విద్యార్థిని అనన్య శౌరి మాట్లాడుతూ నాకు ఎయిమ్స్ లాంటి సంస్థలలో సీటు వచ్చే అవకాశం ఉన్న నేను జన్మించిన, నేను ఇంతవరకు చదువుకున్న ఈ అనంతనగరంలోనే వైద్య విద్య కూడా పూర్తి చేసి ఇక్కడ ఉన్న పేద ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందించాలన్నదే తన లక్ష్యమని అనన్య తెలిపారు. ఈ సందర్భంగా అనన్యను వైస్ ప్రిన్సిపాల్ ఆచార్య డాక్టర్ తెలుగు మధుసూదన్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ ఆదిరెడ్డి పరదేశి నాయుడు, సీనియర్ సహాయకులు రాధ తదితరులు అభినందించారు.


