Homeజిల్లాలుకోనసీమరాజకీయాలకతీతంగా సేవా కార్యక్రమాలు

రాజకీయాలకతీతంగా సేవా కార్యక్రమాలు

- Advertisement -

నిరుపేద మహిళ జీవితంలో వెలుగులు నింపిన మంత్రి సుభాష్
నూతన గృహాన్ని ప్రారంభిస్తున్న మంత్రి సుభాష్

విశాలాంధ్ర: రామచంద్రపురం : పేదల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కె.గంగవరం మండలం సత్యవాడ గ్రామానికి చెందిన సలాది శేషవేణి అనే నిరుపేద మహిళకు మంత్రి చొరవతో సొంతింటి కల సాకారమైంది. భర్తను కోల్పోయి, కుమార్తెతో కలిసి పాడుబడిన గుడిసెలో దుర్భర జీవితం గడుపుతున్న శేషవేణి పరిస్థితిని మంత్రి సుభాష్ తన గ్రామ పర్యటనలో స్వయంగా చూసి చలించిపోయారు.ఆ కుటుంబానికి పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వాలని సంకల్పించిన మంత్రి, తన వంతుగా రూ.65 వేల ఆర్థిక సహాయం అందించారు. మంత్రి పిలుపుతో స్పందించిన దాతలు పామర్తి గోపి రూ.50 వేలు, డేగల నాగేంద్ర రూ.25 వేలు, యరంశెట్టి రాంబాబు రూ.10 వేలు తో పాటు గ్రామస్థులు కూడా తమ వంతు సహాయం అందించారు.అందరి సహకారంతో వేగంగా పూర్తయిన నూతన గృహాన్ని మంగళవారం మంత్రి వాసంశెట్టి సుభాష్ చేతుల మీదుగా ప్రారంభించి, శేషవేణి కుటుంబంతో గృహప్రవేశం చేయించారు. ఈ సందర్భంగా శేషవేణి కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తూ మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి సుభాష్ చేస్తున్న సేవా కార్యక్రమాలు రాజకీయాలకు అతీతంగా, మానవత్వానికి ప్రతీకగా నిలుస్తున్నాయని స్థానిక ప్రజలు కొనియాడారు.ఈ కార్యక్రమంలో సత్యవాడ గ్రామ నాయకులు సలాది శ్రీను, ఎంపీటీసీ సలాది ఎర్రిబాబు, సలాది రమేష్, దేవరపల్లి చక్రి, తోట వెంకన్న, బండారు చిన్నబాబు, సలాది సర్వేష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు