Homeసినిమాటాక్సిక్ ట్విట్టర్ రివ్యూ..

టాక్సిక్ ట్విట్టర్ రివ్యూ..

- Advertisement -

గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నయనతార, రుక్మిణి వసంత్, తారా సుతారియా, హ్యుమా ఖురేషి కీలక పాత్రల్లో నటించారు.
రవి బస్రూర్ సంగీతం అందించిన ఈ సినిమా నేడు (బుధవారం, ఆగస్టు 26) ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

‘కేజీఎఫ్’ సినిమాల తర్వాత యశ్ నటించిన చిత్రం కావడంతో ‘టాక్సిక్’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ప్రీమియర్ షోలు, ఎర్లీ స్క్రీనింగ్‌లు ప్రదర్శించారు.సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.కొందరు మాత్రం ‘టాక్సిక్’ అదిరిపోయిందంటూ కామెంట్లు చేస్తున్నారు.యశ్ ఇరగదీశాడని, అతడి స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతంగా ఉందని ప్రశంసిస్తున్నారు.మొత్తంగా ఈ సినిమా యశ్ అభిమానులకు ఫుల్ ఫీస్ట్‌లా ఉందని చెబుతున్నారు.

సినిమాకు అదే మైనసా?
అయితే మరోవైపు కొందరు ప్రేక్షకులు మాత్రం సినిమా అంచనాలను అందుకోలేదని అంటున్నారు.ముఖ్యంగా ఫస్టాఫ్ గందరగోళంగా ఉందని, పాత్రల పరిచయం కూడా సరిగ్గా లేదని కామెంట్లు చేస్తున్నారు.అలాగే మూడు గంటలకు పైగా ఉన్న రన్‌టైమ్ కూడా సినిమాకు మైనస్‌గా మారిందని కొందరు అభిప్రాయపడుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు