Homeతెలంగాణతెలంగాణలో రెయిన్ అలర్ట్.. హైదరాబాద్ సహా 9 జిల్లాలకు భారీ వర్ష సూచన

తెలంగాణలో రెయిన్ అలర్ట్.. హైదరాబాద్ సహా 9 జిల్లాలకు భారీ వర్ష సూచన

- Advertisement -

తెలంగాణలో రానున్న రెండు, మూడు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
తెలుగు రాష్ట్రాలపై ద్రోణి ప్రభావం కొనసాగుతున్న నేపథ్యంలో.. రాష్ట్రంలో ఇవాళ, రేపు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.మిగిలిన ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడనున్నాయని పేర్కొన్నారు.

హైదరాబాద్ సహా తొమ్మిది జిల్లాలకు ఎల్లో అలర్ట్
వాతావరణ శాఖ అంచనాల ప్రకారం.. తెలంగాణలో హైదరాబాద్ సహా తొమ్మిది జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముంది.దీంతో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. పశ్చిమ, ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లో అక్కడక్కడా వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు, నల్గొండ, వరంగల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.ఆయా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు

వర్షాలతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు వర్షం సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

హైదరాబాద్‌లోనూ వర్షాలు
హైదరాబాద్ నగరంలోనూ ఇవాళ, రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.మంగళవారం నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. బుధవారం తెల్లవారుజామున కూడా నగరంలో వర్షం పడింది.అయితే ఇవాళ మధ్యాహ్నం తర్వాత హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.వర్షాల సమయంలో జాగ్రత్తగా ఉండాలి.భారీ వర్షాలు, ఈదురుగాలులు వీచే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.చెట్ల కింద, విద్యుత్ స్తంభాల సమీపంలో, భారీ హోర్డింగ్‌లు ఉన్న ప్రాంతాల్లో నిల్చోవద్దని హెచ్చరించారు.వీలైనంత త్వరగా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచనలు జారీ చేశారు.

అన్నదాతకు ఊరట
ఇదిలా ఉండగా.. రాష్ట్రంలో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు రైతులకు కొంత ఊరటనిస్తున్నాయి.విత్తనాలు నాటి వర్షాల కోసం ఎదురుచూస్తున్న రైతులు.. తాజాగా కురుస్తున్న వానలతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.పంటల సాగుకు ఈ వర్షాలు ఉపయోగపడతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు